వరుణ్, లావణ్య వెడ్డింగ్ కార్డు చూశారా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ భామ లావణ్య త్రిపాఠి పెళ్లి శుభలేఖ నెట్టింట లీక్ అయ్యింది.

Update: 2023-10-26 12:23 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డింపుల్ భామ లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న సంగతి అందరికి తెలిసిందే. జూన్ లోనే ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకున్న ఈ జంట ఏడడుగులు వేయడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులు నుంచి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో పెళ్లి సందడి మొదలు పెట్టేసిన ఈ జంట.. మరో వారంలో ఒకటి కాబోతున్నారు. తాజాగా ఈ పెళ్లి శుభలేఖ నెట్టింట లీక్ అయ్యింది.

ఈ వెడ్డింగ్ కార్డులో వరుణ్ తేజ్.. నాయనమ్మ-తాతయ్యల పేర్లతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్, అన్నయ్య రామ్ చరణ్ పేర్లను కూడా ప్రింట్ చేశారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది. నవంబర్ 1న వరుణ్, లావణ్య మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో అక్టోబర్ 30 నుంచి ఈ పెళ్లి వేడుక మొదలు కానుందట.
రేపు అక్టోబర్ 27న మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి బయలుదేరనున్నారట. పెళ్లిని కేవలం మెగా, అల్లు కుటుంబసభ్యులు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోనే చేసుకోబోతున్న వరుణ్, లావణ్య.. నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో బంధుమిత్రులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీస్, మరికొంతమంది ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారట.
ఇక ఈ పెళ్లి వేడుకకు కోసం మెగాహీరోలంతా తమ షూటింగ్స్ కి బ్రేక్ చెప్పేశారట. అయితే అందరిలో ఒక సందేహం నెలకుంది. ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడా..? లేదా..? ప్రస్తుతం పవన్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో దేశం దాటి వెళ్లి కొత్త జంటని ఆశీర్వదిస్తాడా..? అనేది చూడాలి.




 


Tags:    

Similar News