ఒక ఇంటివారైన టాలీవుడ్ హీరో, కమెడియన్..
టాలీవుడ్ లోని బ్యాచిలర్స్ ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తాజాగా ఇద్దరు టాలీవుడ్ నటులు ఒక ఇంటివారయ్యారు.
టాలీవుడ్ లోని బ్యాచిలర్స్ ఒకరి తరువాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈక్రమంలోనే కొందరు ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని పెళ్లి ముహర్తం కోసం ఎదురు చూస్తుంటే.. మరికొందరు ఏడడుగులు వేసి తమ బ్యాచిలర్ లైఫ్స్ కి బై బై చెప్పేస్తున్నారు. తాజాగా ఇద్దరు టాలీవుడ్ నటులు ఒక ఇంటివారయ్యారు. వారిలో ఒకరు యువ హీరో త్రిగన్ (Thrigun). గరుడ వేగా, 24 కిస్సెస్, డియర్ మేఘా, కొండా, ప్రేమదేశం వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.
తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ అక్కడ కూడా మంచి ఫేమ్ ని అందుకున్నాడు. హీరోగా నటిస్తూనే పలు సినిమాల్లో కొన్ని ముఖ్య పాత్రలు చేస్తూ అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా చెన్నైకి చెందిన 'నివేదితా' అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తమిళనాడులో జరిగిన ఈ పెళ్లి వేడుకకు.. తేజస్వి మదివాడ, ఆదర్శ్ బాలకృష్ణ వంటి టాలీవుడ్ నటులు హాజరయ్యారు. ఇక ఈ పెళ్లి ఫోటోని త్రిగన్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలాగే టాలీవుడ్ లోని కమెడియన్ 'మహేష్' కూడా ఏడడుగులు వేసేశాడు. యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మహేశ్.. రాయలసీమ యాసతో ప్రతి ఒక్కర్ని అలరిస్తూ వచ్చాడు. తక్కువ కాలంలోనే టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, ఆ తరువాత ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ సీజన్3 తో పాటు ఓటీటీ బిగ్‌బాస్ లో కూడా కనిపించాడు. ఆ సమయంలో తన పెళ్లి వార్తని చెప్పుకొచ్చాడు మహేష్.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో పెళ్లి ఉంటుంది. ప్రేమించే పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పికొచ్చాడు. అన్నట్టు గానే తన ప్రియురాలు శ్రావణి రెడ్డితో ఏడడుగులు వేశాడు. కడపలోని ప్రొద్దుటూరు వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేష్ తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. నెటిజెన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.