నాకు ఎలాంటి గాయాలు అవ్వలేదు
హీరో రాజశేఖర్ కారు ఆక్సిడెంట్ కి గురైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రాజశేఖర్ ఇంటికి వెళుతుండగా రాజశేఖర్ కారు పల్టీలు కొట్టడంతో… ఆయనకు తీవ్ర గాయాలైనట్టుగా [more]
హీరో రాజశేఖర్ కారు ఆక్సిడెంట్ కి గురైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రాజశేఖర్ ఇంటికి వెళుతుండగా రాజశేఖర్ కారు పల్టీలు కొట్టడంతో… ఆయనకు తీవ్ర గాయాలైనట్టుగా [more]
హీరో రాజశేఖర్ కారు ఆక్సిడెంట్ కి గురైంది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి రాజశేఖర్ ఇంటికి వెళుతుండగా రాజశేఖర్ కారు పల్టీలు కొట్టడంతో… ఆయనకు తీవ్ర గాయాలైనట్టుగా వార్తలొచ్చాయి. రాజశేఖర్ డ్రైవ్ చేస్తుండగా.. కారు మూడు పల్టీలు కొట్టడంతో… కారు ముందరి భాగం నుజు నుజ్జు అవడంతో.. రాజశేఖర్ కి గాయాలైనాయని మీడియాలో వార్తాలు రావడంతో అందరూ షాకయ్యారు. రాజశేఖర్ కారుకి ప్రమాదం, ఆయన కు గాయాలు, హాస్పిటల్ లో చికిత్స పొందుతులున్న రాజశేఖర్ అని మీడియాలో వార్తలు చూసిన ఆయన అభిమానులు షాకవ్వడం జరిగింది.
అయితే రాజశేఖర్ కారుకి ప్రమాదం, కారు నుజ్జు నుజ్జు అవడం నిజమే కానీ… ఆ ప్రమాదం లో ఆయనకు ఎలాంటి గాయాలు అవలేదని స్వయానా రాజశేఖర్ చెబుతున్నారు. కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని, అయితే కారు పల్టీలు కొడుతున్నప్పుడు బెలూన్స్ తెరుచుకోవడంతో.. పెను ప్రమాదం తప్పిందని ఆయన వివరించారు. పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద అయన కారు ప్రమాదానికి గురైంది. అయితే ఎదురు గా కారులో వస్తున్న వారు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురవడం చూసి ఆయన్ని కారులో నుండి బయటికి తియ్యగా రాజశేఖర్ సేఫ్ గా ఉన్నారట. వారి ఫోన్ లో నుండి ఫ్యామిలీ మెంబెర్స్ కి పోలీస్ లకు ఫోన్ చేసి ఆక్సిడెంట్ విషయాన్నీ చెప్పినట్లుగా రాజశేఖర్ చెబుతున్నాడు