టాలీవుడ్ కోలుకోలేకపోతుంది

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ మృతి నుంచి టాలీవుడ్ ఇంకా కోలుకోలేదు. ఆయన కరోనా సోకి నిన్న సాయంత్రం మృతి చెందారు.

Update: 2021-11-29 01:54 GMT

కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ మృతి నుంచి టాలీవుడ్ ఇంకా కోలుకోలేదు. ఆయన కరోనా సోకి నిన్న సాయంత్రం మృతి చెందారు. టాలీవుడ్ ప్రముఖులందరూ శివశంకర్ మాస్టార్ మృతి పట్ల సంతాంపం వ్యక్తం చేస్తున్నారు. శివశంకర్ మాస్టార్ కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకింది. ఆయనకు ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ సోకడంతో వెంటిలేటర్ పైనే ఉంచి చికిత్స అందించారు. చివరకు ఆయన మృతి చెందడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది.

చెన్నైలో పుట్టి....
72 ఏళ్ల శివశంకర్ మాస్టార్ చెన్నై లో పుట్టి సలీమ్ వద్ద అసిస్టెంట్ డ్యాన్స్ డైరెక్టర్ గా పనిచేశారు. దాదాపు 800 చిత్రాలకు శివశంకర్ మాస్టార్ నృత్య దర్శకుడిగా వ్యవహరించారు. శివశంకర్ మాస్టార్ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి మూడు లక్షలను ఇచ్చారు. ఆయన మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.


Tags:    

Similar News