హాస్యనటి ఇంట విషాదం

టాలీవుడ్ హాస్యనటి గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు

Update: 2023-02-18 06:15 GMT

టాలీవుడ్ హాస్యనటి గీతాసింగ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్ణాటకలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని మరో నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గీతా సింగ్ దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఆమె పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో...
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. గీతాసింగ్ పెళ్లి చేసుకోకుండా తన సోదరుడి కుమారుడిని దత్తత తీసుకున్నారు. అనేక తెలుగు సినిమాల్లో గీతా సింగ్ కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు.


Tags:    

Similar News