2023 Rewind : ఈ ఏడాది మనకి దూరమైన సినీ తారలు వీరే..

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీ ఒకప్పటి తారలతో పాటు ఇప్పటి కళాకారులను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలా ఈ ఏడాది మనకి దూరమైన..

Update: 2023-12-31 15:35 GMT
2023 Rewind :ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీ ఒకప్పటి తారలతో పాటు ఇప్పటి కళాకారులను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అలా ఈ ఏడాది మనకి దూరమైన సినీ తారలు ఎవరో తెలుసుకోండి.
జమున..
వెండితెర సత్యభామగా పేరుని సంపాదించుకున్న అగ్ర నటి జమున.. జనవరి 27న 86 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఆమె కొన్నాళ్ల నుంచి వయోభారంతో బాధపడుతున్నారు.

 

కె విశ్వనాథ్..
19's లోనే తెలుగు సినీ పరిశ్రమని నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకువెళ్లిన దర్శకుడు కె విశ్వనాథ్. మన సంస్కృతిలోని కళలను తన సినిమాలో ప్రతిబింబిచేలా చిత్రాలు తెరకెక్కించి కళాతపస్వి అనే బిరుదుని అందుకున్న విశ్వనాథ్.. ఫిబ్రవరి 3న వృద్ధాప్య సమస్యలతో 92 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.

 

వాణీ జయరామ్..
తన గాత్రంతో దాదాపు 19 భాషల వారిని అలరించిన వాణి జయరామ్.. తన కెరీర్ లో 20 వేలకు పైగా పాటల్ని పాడారు. ఈమె 77 ఏళ్ళ వయసులో ఫిబ్రవరి 4న అనారోగ్య కారణాలతో మరణించారు.

 

నందమూరి తారకరత్న..
నందమూరి తారకరత్న సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగులు వేస్తున్న సమయంలో పొలిటికల్ కాంపెయిన్ లోనే అనారోగ్యానికి గురై మరణించడం బాధాకరం. గుండెపోటుకు గురైన తారకరత్న దాదాపు 23 రోజుల పాటు చావుతో పోరాడి ఫిబ్రవరి 18న 39 ఏళ్ళ వయసులో మరణించారు.

 

శరత్ బాబు..
సీనియర్ నటుడు శరత్‌బాబు.. 71 ఏళ్ళ వయసులో మే 22న మరణించారు. హీరోగా, విలన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఆడియన్స్ ని అలరించిన శరత్ బాబు.. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు.

 

చంద్రమోహన్..
దాదాపు పరిశ్రమలోని అగ్ర దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ కలిసి నటించిన చంద్రమోహన్.. హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించారు. వృద్ధాప్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్న చంద్రమోహన్.. 78 ఏళ్ళ వయసులో నవంబర్ 11న కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు.

 

రాజ్..
90'sలో తన సంగీతంతో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన రాజ్-కోటి సంగీత ద్వయంలలో ఒకరైన రాజ్.. 68 ఏళ్ళ వయసులో మే 21న గుండెపోటుతో మరణించారు.

 

శ్రీనివాస మూర్తి..
ఇతర పరిశ్రమ నటులు సూర్య, విక్రమ్, అజిత్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలకు తెలుగు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి.. జనవరి 27న హార్ట్ ఎటాక్‌తో కన్నుమూసారు.

 

సాగర్..
ఒకప్పటి అగ్ర దర్శకుడు సాగర్.. అనారోగ్య సమస్యలతో 73 ఏళ్ళ వయసులో ఫిబ్రవరి 2న కన్నుమూశారు.

 

సుధీర్ వర్మ..
టాలీవుడ్ సినిమాలు కుందనపు బొమ్మ, సెకండ్ హ్యాండ్ వంటి చిత్రాల్లో నటించిన సుధీర్ వర్మ.. ఆర్ధిక సమస్యలతో జనవరి 24న సూసైడ్ చేసుకొని 34 ఏళ్ళ వయసులో మరణించారు.

 

మనోబాల..
తమిళ స్టార్ కమెడియన్ మనోబాల.. లివర్ సంబంధిత సమస్యలతో మే 3న 69 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.

 

మయిల్ సామి..
ప్రముఖ తమిళ హాస్య నటుడు మయిల్ సామి.. అనారోగ్య కారణాలతో 57 వయసులో ఫిబ్రవరి 19న మృతి చెందారు.

 

ఆకాంక్ష దుబే..
భోజ్ పురి నటి ఆకాంక్ష దుబే.. అనుమానస్థితిలో మార్చి 26న మరణించారు. ఆమెకు 23 ఏళ్ళ వయసు. ఇక ఇది ఆత్మహత్య? హత్యా? అనేది క్లారిటీ లేదు.

 

ఆదిత్య సింగ్ రాజ్‌పుత్..
ప్రముఖ హిందీ సీరియల్ నటుడు ఆదిత్య సింగ్ రాజ్‌పుత్.. మే 22న 32 ఏళ్ళ వయసులో మరణించారు.

 

Tags:    

Similar News