Tollywood : టాలీవుడ్ లెక్కలు తెలుస్తా.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి..

టాలీవుడ్ లెక్కలు తెలుస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Update: 2023-12-12 06:09 GMT

Telangana cinematography minister

Tollywood : తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. కొత్త మంత్రులు పదవులు చేపడుతున్నారు. ఆయా శాఖల పై కొత్త మంత్రులు దృష్టి సారిస్తున్నారు. ఇక కొత్తగా పదవి చేపట్టిన మంత్రులకు, నాయకులకు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్ వంటి స్టార్స్ ట్వీట్స్ ద్వారా తెలియజేశారు.

అయితే తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రి.. తనకి టాలీవుడ్ నుంచి ఎటువంటి ప్రత్యేక అభినందనలు రాలేదని ఫీల్ అయ్యారట. అంతేకాదు టాలీవుడ్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త సినిమాటోగ్రఫీ మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భాద్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఛార్జ్ తీసుకున్న తరువాత నిర్మాత దిల్ రాజు ఒక్కరే విష్ చేశారట. ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయలేదట.
ఇక దీనికి ఫీల్ అయిన ఈ కొత్త మంత్రి తాజాగా ఓ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. "ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో చూస్తా. త్వరలోనే అన్ని లెక్కలు తెలుస్తా" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి టాలీవుడ్ సెలబ్రిటీస్ మంత్రి కామెంట్స్ ని గమనించి శుభాకాంక్షలు తెలియజేస్తారేమో చూడాలి. ఇక ఈ కామెంట్స్ పై నెటిజెన్స్ సరదా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.


Tags:    

Similar News