బాలకృష్ణపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్
తారకరత్నను బ్రతికించుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎంత శ్రమించినా.. ఫలితం దక్కలేదు. అందరినీ వదిలి..
alekhya reddy emotional post
నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై.. ఆయన తుదిశ్వాస విడిచేంత వరకూ.. బాబాయ్ బాలకృష్ణ పడిన తపనను ఎవరూ మరచిపోలేరు. తారకరత్నను బ్రతికించుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. ఎంత శ్రమించినా.. ఫలితం దక్కలేదు. అందరినీ వదిలి తారకరత్న పై లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న లేని లోటు నుంచి ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇంకా కోలుకోలేకపోతున్నారు. ఆయన చనిపోయాక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తూ నెటిజన్ల హృదయాలను కదిలిస్తున్నారు. తాజాగా అలేఖ్య రెడ్డి నందమూరి బాలకృష్ణ గురించి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.
'మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి (బాలకృష్ణ). కష్ట, సుఖాల్లో చివరి వరకు ఒక కొండలా అండగా నిలిచిన ఏకైక వ్యక్తి. ఒక తండ్రిలా ఆసుపత్రికి తీసుకెళ్లడం దగ్గర నుంచి ఆసుపత్రిలో నీ బెడ్ పక్కన కూర్చోవడం, నీ కోసం తల్లిలా పాటలు పాడటం, సిల్లీ జోక్స్ వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం, చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం... ఆయన ఎప్పుడూ మనతోనే ఉన్నారు. ఓబు (తారకరత్న) నీవు తొందరగా వెళ్లిపోయావు. నిన్ను చాలా మిస్ అవుతున్నాను' అని అలేఖ్య ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ మార్ఫింగ్ ఫొటోను ఎవరు ఎడిట్ చేసి పెట్టారో కానీ వారికి ధన్యవాదాలు చెబుతున్నాను. చాలా అందంగా ఎడిట్ చేశారు అని అలేఖ్య పేర్కొన్నారు.