ప్రస్తుతం తమన్నా పరిస్థితి ఏం బాగోలేదు. ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్స్ రాకతో తమన్నా క్రేజ్ రోజు రోజుకి పడిపోతుంది. టాలీవుడ్ లో ఒకటి అరా సినిమాల్తో సరిపెట్టుకుంటున్న తమన్నా కి కోలీవుడ్ లోను, బాలీవుడ్ లోను అదే పరిస్థితి. ఒక్కో సినిమాకి తమన్నా కొత్త హీరోయిన్స్ తీసుకునే పారితోషకం అంటే... 50 లక్షల లోపే ఉంటుంది. అయితే తమన్నాకి ఇప్పుడు ఒక్క సినిమాకి 100 రోజుల పాటు కష్టపడితే వచ్చే పారితోషకం... కేవలం పదినిమిషాలు కష్టపడితేనే వచ్చేస్తుంది. ఒక్క పది నిమిషాల కోసం తమన్నా అక్షరాలా 50 లక్షలు అందుకుంటుంది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఐపీఎల్ సందడి మొదలైపోయింది. ఐపీఎల్ తో బిసిసిఐ కోట్లు వెనకేసుకుంటుంది. అందుకే ఐపీఎల్ ని భారీగా ప్రమోట్ చెయ్యడమే కాదు... ఐపీఎల్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా అంతే భారీగా నిర్వహిస్తూ వస్తుంది. మరి ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో బాలీవుడ్ హీరోయిన్స్ ఆట పాట విందు వినోదం వంటి వాటితో ఐపీఎల్ ఆటగాళ్లు బాగా ఎంజాయ్ చేస్తూ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతారు. అయితే ఈ ఐపీఎల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇంతకుముందు ప్రియాంక చోప్రా దగ్గరనుండి.... దీపికా పడుకొనే వరకు స్టేజ్ మీద సందడి చేశారు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ ని తమన్నా కొట్టేసింది. బాలీవుడ్ హీరోలతో పాటు తమన్నా కూడా ఐపీఎల్ ప్రారంభోత్సవానికి స్టేజ్ మీద పది నిమిషాల డాన్స్ పెరఫార్మెన్స్ కోసం రెడీ అయ్యింది.
ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తమన్నా కేవలం 10 నిమిషాల పెరఫార్మెన్స్ కోసం అక్షరాలా 50 లక్షలు అందుకుంది. ప్రస్తుతం తమన్నా క్రేజ్ కి ఆ మొత్తం ఎక్కువే అయినప్పటికీ ... తన తోటి వారు అందుకునే పారితోషకం కన్నా ఈ లెక్క మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. బాలీవుడ్ హీరో రణ్వీర్ ఈ స్టేజ్ మీద చేసే 15 నిమిషాల పెరఫార్మెన్స్ కి అక్షరాలా ఐదు కోట్లు అందుకుంటున్నాడు. మరి పాపం తమన్నా ఇలా పది నిమిషాల కోసం 50 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.