Coolie First Day Collections : ఫస్ట్ డే కలెక్షన్స్ తో రజనీ రికార్డు బ్రేక్ చేశాడా? కూలీ నెంబర్ వన్ గా నిలిపాడా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి

Update: 2025-08-15 06:16 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలయింది. అయితే ఈ మూవీని ఒంటిచేత్తో రజనీ కాంత్ హిట్ కొట్టించాడంటూ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందులోనూ యాభై ఏళ్ల సినీ జీవితం సందర్భంగా విడుదలయిన ఈ సినిమాపై తొలి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. అందరూ అనుకున్నట్లుగానే కూలీ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే తొలి రోజు కలెక్షన్లు రజనీకాంత్ బ్రేక్ చేస్తారడా? లేదా? అన్నది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

హిట్ టాక్ రావడంతో...
సూపర్ స్టార్ రజనీకాంత్, అక్కినేని నాగార్జున, సౌబిన్ సాహిర్, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, అమీర్ ఖాన్ వంటి హేమాహేమీలు నటించినా ఇందులో రజనీ యాక్షన్ చూసి తంబిలు ఫిదా అయిపోతున్నారు. అందులోనూ వరస సెలవులు రావడంతో ఇక కలెక్షన్లకు కొదవలేదని గురువారమే చిత్రాన్ని విడుదల చేశారు. వయసు తగిన పాత్రలో ఆయన కనిపిస్తూ తన అభిమానులను అలరించారు. ట్విస్ట్ లతో అలరించే ఈ మూవీ ఆద్యంతం వీక్షకులను ఆకట్టుకుందన్న టాక్ బాగా వినపడింది.
గత చిత్రం రికార్డులను...
అయితే తాజాగా కూలీ చిత్రానికి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. తొలి రోజు కలెక్షన్లు గత రికార్డులను రజనీ బ్రేక్ చేశాడని అంటున్నారు. ఒక్కరోజులోనే గత మూవీల ట్రాక్ రికార్డును రజనీ దాటేశాడన్న వార్త గుప్పుమంటోంది. ఫస్ట్ డే కలెక్షన్స్ మూవీ సినిమాకు 170 కోట్ల రూపాయలు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తమిళంలో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన చిత్రలలలో దళపతి విజయ్ నటించిన లియో చిత్రం పేరిట రికార్డు అయి ఉంది. లియో చిత్రం తొలిరోజు 148 కోట్లు రాబట్టింది. కూలీ కనుక 170 కోట్లు రాబట్టి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేసినట్లే అవుతుంది. అయితే మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Tags:    

Similar News