కళావతీ... కప్పు నీదే... నాది కాదు

బిగ్ బాస్ సీజన్ 5 లో విజేతగా సన్నీ నిలిచారు. తొలి నుంచి గేమ్స్ లోనూ, వ్యవహార శైలిలోనూ సన్నీది ప్రత్యేకత

Update: 2021-12-20 02:42 GMT

బిగ్ బాస్ సీజన్ 5 లో విజేతగా సన్నీ నిలిచారు. తొలి నుంచి గేమ్స్ లోనూ, వ్యవహార శైలిలోనూ సన్నీది ప్రత్యేకత. అందుకే సన్నీని ప్రేక్షకకులు విజేతగా నిలిపారు. ఆగ్రహం వచ్చినా ఆపుకోలేరు. నవ్వు వచ్చినా అంతే. ఎదుటి వారు ఏమనుకుంటారనికాదు. తాను ఏమనుకుంటాడో నిర్మొహమాటంగా చెప్పే మనస్తత్వం సన్నీది. హౌస్ లో ఉన్న 105 రోజులు సన్నీ దాదాపు అందరితోనూ గొడవ పడ్డారు. టాస్క్ ల విషయంలోనే ఎక్కువగా ఈ గొడవలు జరిగేవి.

ప్రతి ఎలిమినేషన్ లోనూ...
ప్రతి ఎలిమినేషన్ లోనూ సన్నీ యే టార్గెట్ అయ్యేవాడు. దాదాపు పదమూడు వారాల్లో అత్యధికంగా ఎలిమినేషన్ లో ఉంది సన్నీ యేనట. కానీ చివరకు విజేతగా నిలిచారు. తాను కోరుకున్నది సాధించానని సన్నీ చెప్పుకొచ్చాడు. తన తల్లి మొదటి కోరికను నెరవేర్చానని సన్నీ గర్వపడ్డాడు. నాగార్జున ప్రత్యేకంగా సన్నీ తల్లి కళావతిని వేదికపైకి రప్పించారు. ఈ కప్పు తనది కాదని, కళావతిది అని తన తల్లిని ముద్దుపెట్టుకుని మరీ చెప్పాడు. ఇట్లాంటివి చాలా వస్తాయి దాచుకో అని జోక్ పేల్చాడు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి సన్నీ కృతజ్ఞతలు తెలిపారు.


Tags:    

Similar News