సలార్ టీజర్ వచ్చేస్తోంది

ఈ కలయిక సంచలనం సృష్టించబోతోంది. మాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి

Update: 2022-06-12 08:25 GMT

ప్రభాస్, 'కేజీఎఫ్' డైరక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్స్, లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. కేజీఎఫ్, కేజీఎఫ్-2 లో ఇచ్చిన ఎలివేషన్స్ కు ఆడియన్స్ ఫిదా అవ్వగా.. సలార్ లో ప్రభాస్ ను ఏ రేంజిలో చూపిస్తాడో ప్రశాంత్ నీల్ అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మే చివరి వారంలోనే టీజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం టీజర్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. జులై రెండో వారంలో టీజర్ విడుదల కాబోతోందని, దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు.

సలార్ సినిమా టీజర్ కేజీఎఫ్-2 సినిమాలో చూపిస్తారనే ప్రచారం కూడా సాగిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు తాజాగా కొత్త డేట్ చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట కేజీఎఫ్ నిర్మాత విజయ్ మాట్లాడుతూ సలార్ విషయంలో తాము ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని అన్నారు. విజయ్ మాట్లాడుతూ, "మేము సాలార్ కోసం చాలా ఎక్కువ అంచనాలు పెట్టుకున్నాం. భారతదేశపు నంబర్ వన్ సినిమా (బాహుబలి 2)లో హీరోగా నిలిచిన ప్రభాస్, మరోవైపు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద చిత్రం (KGF 2) తీసిన ప్రశాంత్ నీల్ కలయిక కాబట్టి ఇది పెద్ద సవాలుగా మారనుంది. ఈ కలయిక సంచలనం సృష్టించబోతోంది. మాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తాము. సలార్‌తో మేం అనుకున్నది సాధిస్తాం" అని చెప్పుకొచ్చారు. ఈ మాటలు వింటుంటేనే సలార్ టీజర్ మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.


Tags:    

Similar News