సెకండ్ వీక్ లోను దున్నేస్తున్న ప్రతి రోజు పండగే

ప్రతి రోజు పండగే సినిమా డిసెంబర్ 20 న విడుదలైన యావరేజ్ టాక్ తోనే సాయి తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో బాటుగా కెరీర్ బెస్ట్ [more]

Update: 2020-01-03 04:32 GMT

ప్రతి రోజు పండగే సినిమా డిసెంబర్ 20 న విడుదలైన యావరేజ్ టాక్ తోనే సాయి తేజ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో బాటుగా కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ కొల్లగొడుతుంది. మొదటి వారం వరకు బాగా ఆడిన ప్రతి రోజు పండగే సినిమాకి రెండో వారం పెద్ద, ఇంట్రెస్ట్ గల సినిమాలేవీ లేకపోయేసరికి రెండో వారం లోను పండగ కలెక్షన్స్ కళకళలాడుతున్నాయి. రెండో వీకెండ్ లోను థియేటర్స్ నిండిన పండక్కి.. జనవరి ఫస్ట్ హాలిడే కలిసిరావడం, జనవరి 1 న డబ్బింగ్ సినిమాల హడావిడి తప్ప ఏమి లేకపోవడంతో.. ఫామిలీస్ అంతా ప్రతి రోజు పండగే థియేటర్స్ కి క్యూ కట్టాయి.

హిట్ అన్న సినిమాలకు రెండో వారంలో కలెక్షన్స్ రావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో ప్రతి రాజు పండగే రెండో వారంలోను హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం మాత్రం షాకింగ్ విషయమని చెప్పాలి. ఇప్పటికే 25 నుండి 30 కోట్ల గ్రాస్ లో పండగ కలెక్షన్స్ ఉన్నాయని ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు…. సంక్రాతి సినిమాల వచ్చేవరకు అదే జోరు కలెక్షన్స్ కొనసాగొచ్చని అంటున్నారు. పండగ సినిమాల వరకు ప్రతిరోజూ పండగ తప్ప మరే ఆప్షన్ కనిపించడం లేదు. కనక మారుతీ – సాయి తేజ్ మాత్రం ఈ అవకాశాన్ని బాగా క్యాష్ చేసుకోవడమే కాక.. సినిమాని అలానే ప్రమోట్ చేసుకుపోతున్నారు.

Tags:    

Similar News