ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

భారీ హైప్ తో వస్తున్న ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కులను అప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీల్ కు సొంతం చేసుకుందని తెలుస్తోంది.

Update: 2021-12-12 05:02 GMT

నెట్టింట ఎక్కడ చూసినా.. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లేదా పాటలే కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో జక్కన్న ఏ మాత్రం తగ్గట్లేదు. ట్రైలర్ లో ఎవరీ ఊహకీ అందని ఎలివేషన్స్ తో.. అందరిలోనూ సినిమా పై ఆసక్తిని పెంచేశారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఇదే. ఈ సినిమా 2022, జనవరి 7వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్ డేట్.. అభిమానుల్లోనే కాకుండా.. సినీ ప్రియుల్లోనూ ఆసక్తిని పెంచుతోంది.

భారీ డీల్....
భారీ హైప్ తో వస్తున్న ఆర్ఆర్ఆర్ డిజిటల్ హక్కులను అప్పుడే ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ డీల్ కు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత 70 రోజులకు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఆర్ఆర్ఆర్ ఓటీటీ హక్కులను సొంతం చేసుకుందని, ఈ హక్కుల కోసం భారీ మొత్తంలో చెల్లించినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే.. ఇది కేవలం హింగీ వెర్షన్ ఆర్ఆర్ఆర్ మాత్రమేనా ? లేక అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ హక్కులు పొందిందా అన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేస్తే తప్ప.. ఏ భాషలో.. ఏ ఓటీటీ సంస్థ ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందో తెలిసేలా కనిపించడం లేదు.


Tags:    

Similar News