రావణాసుర రివ్యూ : క్రైమ్ థ్రిల్లర్ తో రవితేజ హిట్ కొట్టాడా ?

ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస విజయాల మీద ఉన్న రవితేజ్.. మూడో హిట్ కోసం రావణాసుర తో ప్రేక్షకుల..

Update: 2023-04-07 10:16 GMT

Ravanasura Review

సినిమా : రావణాసుర

విడుదల : 07.04.2023
నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, దక్ష నగర్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్, శ్రీరామ్, జయరామ్, మురళీశర్మ, సంపత్ రాజ్ తదితరులు.
దర్శకుడు: సుధీర్ వర్మ
నిర్మాతలు : అభిషేక్ నామా, రవితేజ
సంగీతం : హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ : విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్ : నవీన్ నూలి
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస విజయాల మీద ఉన్న రవితేజ్.. మూడో హిట్ కోసం రావణాసుర తో ప్రేక్షకుల ముందుకిి వచ్చాడు. మొదటి నుంచి ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అని తెలిసినా.. సినిమాలో రవితేజ నెగిటివ్ రోల్ లో కనిపిస్తాడని జరిగిన ప్రచారంతో.. సినిమాపై అంచనాలు పెరిగాయి. పైగా సినిమాలో ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రవితేజతో నటిస్తున్నారని చెప్పడంతో.. సినిమాలో ఎంతో సస్పెన్స్ ఉండి ఉంటుందని అభిమానులు, సినీ ప్రియులు భావించారు. మరి రావణాసుర క్రైమ్ థ్రిల్లర్ తో మెప్పించాడా ? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం
కథ
రవీంద్ర (రవితేజ) వృత్తిరీత్యా లాయర్. పేరు మోసిన క్రిమినల్ లాయరైన కనక మహాలక్ష్మి (ఫరియా) దగ్గర రవీంద్ర జూనియర్ లాయర్ గా పనిచేస్తుంటాడు. ఒక రోజు హారిక (మేఘా ఆకాశ్) తన తండ్రి (సంపత్ రాజ్)ని ఎవరో హత్యకేసులో ఇరికించారని, ఆయనను కాపాడాలని అడిగేందుకు కనక మహాలక్ష్మి వద్దకు వస్తుంది. కానీ కనక మహాలక్ష్మి ఆ కేసును వాదించేందుకు ఒప్పుకోదు. ఈ క్రమంలో హారికను చూసిన రవీంద్రకు మొదటి చూపులోనే నచ్చేస్తుంది. పర్సనల్ ఇంట్రెస్ట్ తో కేసును తానే టేకప్ చేస్తాడు.
ఈ కేసు ఒప్పుకున్న రవీంద్రకు మరిన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. హారిక తండ్రిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు ? ఆ హత్య చేసిందెవరు ? ఎందుకు చేస్తున్నారు? సినిమాలో మిగతా ముగ్గురు హీరోయిన్ల పాత్రలేంటి ? కిల్లర్ రవీంద్రకు దొరుకుతాడా ? రవీంద్ర జూనియర్ లాయర్ గా కాకుండా ఇంకా ఏం చేస్తాడు ? ఎందుకు చేస్తాడు ? అనే విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
క్రైమ్ నేపథ్యంతో కూడిన థ్రిల్లర్ రావణాసుర. ఇది వరకు ఒకరకమైన నటీనటుల వరకే పరిమితమైన ఇలాంటి కథలు.. ఇప్పుడు మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు. ప్రేక్షకులు కూడా రొటీన్ కు భిన్నంగా థ్రిల్లర్ సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే రవితేజ ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర చేయడమే అందరిలోనూ మరింత ఆసక్తిని పెంచింది. అందుకు తగ్గట్టుగానే సినిమా ప్రారంభమవుతుంది. క్రైమ్ నేపథ్యంలో తీసిన సినిమాల్లో పెద్దగా కామెడీ ఉండదు. కానీ ఇక్కడ రవితేజ హీరోగా ఉండటంతో.. తన మార్క్ కామెడీ సినిమాలో ఎంజాయ్ చేస్తారు ప్రేక్షకులు. హారిక తండ్రిని ఇరికించిన హత్య కేసును వాదించేందుకు జయరామ్ రంగంలోకి వచ్చాక.. సీన్స్ లో థ్రిల్ పెరుగుతుంది.
ఎవరెలా చేశారంటే..
రవితేజ తన పాత్రలో ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంటాడు. ఆయన పాత్రలో రెండు కోణాలను చూపిస్తాడు దర్శకుడు. హీరోగా రవితేజ ఇలాంటి పాత్రతో ఒక ప్రయోగం చేశాడని ప్రేక్షకుడికి అనిపిస్తుంది. ఫైట్స్, పాటల్లో రవితేజ మార్క్ కనిపిస్తుంది. ఐదుగురు హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ లకే స్కోప్ ఎక్కువ ఉంటుంది. అను ఇమ్మాన్యుయేల్ చిన్న పాత్రలో కనిపిస్తుంది. సాకేత్ గా సుశాంత్, జాను గా దక్ష తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే హీరోకి బలంగా సవాల్ చేసే పాత్రలు లేకపోవడం రావణాసుర కి మైనస్ అని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్
+ రవితేజ నటన
+ కథలో మలుపులు
+ ప్రథమార్థం
మైనస్ పాయింట్స్
- సగటు ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగే సన్నివేశాలు
- బలమైన విలనిజం లేకపోవడం
చివరిగా.. రావణాసుర అక్కడక్కడా థ్రిల్ చేస్తాడు











Tags:    

Similar News