ఇప్పటివరకు బాగానే మ్యానేజ్ చేసింది.. కానీ ఇప్పుడే.

ప్రస్తుతం రాశి ఖన్నా టైం నడుస్తుంది. ఒకే నెలలో రెండు సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా వెంకిమామ తో యావరేజ్ అందుకోగా.. నిన్న విడుదలైన [more]

Update: 2019-12-21 05:21 GMT

ప్రస్తుతం రాశి ఖన్నా టైం నడుస్తుంది. ఒకే నెలలో రెండు సినిమాల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాశి ఖన్నా వెంకిమామ తో యావరేజ్ అందుకోగా.. నిన్న విడుదలైన ప్రతి రోజు పండగే సినిమాతో హిట్ కొట్టినట్లే కనబడుతుంది. వెంకిమామ కి బ్యాడ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్స్ బావున్నాయి. ఇక ప్రతి రోజు పండగే సినిమాకి హిట్ రివ్యూస్, ప్రేక్షకుల హిట్ టాక్ తో సినిమా థియేటర్ లో దూసుకుపోతుంది. అయితే వెంకిమామ ప్రమోషన్స్ తోనూ, ప్రతి రోజు పండగే ప్రమోషన్స్ తో ఊపిరి సలపకపోయినా రాశి ఖన్నా రెండిటిని బాగానే బ్యాలెన్స్ చేసి.. రెండు సినిమాల యూనిట్స్ తో సందడి చేసింది.

నిన్న విడుదలైన ప్రతిరోజూ పండగే సినిమాకి హిట్ టాక్ రావడమే కాదు.. రాశి ఖన్నా క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో రాశిఖన్నా తొలిప్రేమ తర్వాత బెస్ట్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అమాయకత్వం..చలాకీతనం.. కాస్త చిలిపితనం.. అన్నీ కలబోసిన పాత్ర ఏంజెల్‌ ఆర్నాగా ఇంప్రెస్‌ చేసింది. మరి ఈ సినిమాలో రాశి ఖన్నా చాల బావుందని అందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే తాజాగా ప్రతి రోజు పండగే విడుదలైన రోజునే రాశి ఖన్నా మరో సినిమా వెంకిమామ విజయోత్సవం గుంటూరు లో జరగడం.. ఇక్కడ పండగ సెలెబ్రేషన్స్ లో బిజీ అయినా రాశి ఖన్నా వెంకిమామ సక్సెస్ సెలెబ్రేషన్స్ కి వెళ్లలేకపోయింది. ఇప్పటివరకు రెండు సినిమాల ప్రమోషన్స్ ని బాగా హ్యాండిల్ చేసిన రాశి ఖన్నా వెంకిమామ సక్సెస్ ఈవెంట్ కి మాత్రం హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వెంకిమామ హైదరాబాద్ లో కాకుండా గుంటూరు లో జరగడంతో రాశి ఖన్నా డుమ్మా కొట్టాల్సి వచ్చింది.

Tags:    

Similar News