రాజమండ్రిలో రామ్ పోతినేని సందడి
రామ్ పోతినేని ముఖ్య పాత్రలో మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'.
రామ్ పోతినేని ముఖ్య పాత్రలో మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రిలో ప్రారంభమైంది. రామ్ పోతినేని, ఉపేంద్ర కు సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ ఒక డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్రలో కనిపిస్తారు. భాగ్యశ్రీ బోర్సే రామ్ సరసన కథానాయికగా నటిస్తోంది. రామ్ పోతినేని రాజమండ్రిలో ఉన్నారని తెలియగానే పలువురు అభిమానులు షూటింగ్ స్పాట్ కు క్యూ కడుతూ ఉన్నారు.