రామ్ సరికొత్త రికార్డు.. సౌత్ ఇండియాలోనే అరుదైన రికార్డు సాధించిన హీరో !

డబ్బింగ్ సినిమాలతో.. సౌత్ హీరోలు ముఖ్యంగా.. తెలుగు హీరోలకు నార్త్ లో కూడా పాపులారిటీ వచ్చేస్తోంది. అలా నార్త్ లో పాపులర్ అయిన..

Update: 2022-02-26 11:16 GMT

హైదరాబాద్ : దక్షిణాది సినిమాలపై ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కడలేని ప్రేమను చూపిస్తున్నారు. తెలుగులో విడుదలైన సినిమాలు.. హిందీ డబ్బింగ్ లో విడుదలైన సినిమా అక్కడ హిట్ అవుతుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ లో వస్తున్న సినిమాలకంటే.. డబ్బింగ్ సినిమాల పైనే బీటౌన్ ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే పుష్ప లాంటి సినిమా అక్కడ వందకోట్లు కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. ఒక్క థియేటర్లలోనే కాదు.. యూట్యూబ్ లో కూడా మన సినిమాలకి అక్కడ భారీ డిమాండ్ ఉంటుంది.

డబ్బింగ్ సినిమాలతో.. సౌత్ హీరోలు ముఖ్యంగా.. తెలుగు హీరోలకు నార్త్ లో కూడా పాపులారిటీ వచ్చేస్తోంది. అలా నార్త్ లో పాపులర్ అయిన హీరోల లిస్ట్ లో రామ్ పోతినేని టాప్ లో ఉన్నారు. రామ్ నటించిన సినిమాలు చాలా వరకు హిందీ వెర్షన్ లో డబ్ అవుతుంటాయి. నేను శైలజా హిందీ డబ్బింగ్ సినిమా గతంలో యూట్యూబ్ లో భారీ వ్యూస్ దక్కించుకుంది. హలో గురూ ప్రేమకోసమే సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కి నార్త్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. హలో గురూ ప్రేమ కోసమే హిందీ డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ లో 400 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

దేవదాసు, జగడం సినిమాల ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు హిందీలో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో రిలీజ్ చెయ్యగా వాటి అన్నిటికి కలిపి ఏకంగా 2 బిలియన్ వ్యూస్ వచ్చాయి. బడా స్టార్ హీరోలను కూడా కాదని.. 2 బిలియన్ వ్యూస్ అందుకున్న ఏకైక దక్షిణాది హీరోగా రామ్ నిలిచి సెన్సేషనల్ రికార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత బీఏ రాజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రామ్ పోతినేని లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కే ది వారియర్ సినిమాతో హిందీలో కూడా గ్రాండ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. 



Tags:    

Similar News