రకుల్ కి మళ్ళీ తేడా కొట్టిందా?

రకుల్ ప్రీత్ కి తెలుగులో మన్మధుడు 2 భారీ డిజాస్టర్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ పక్కన కుర్ర హీరోయిన్ గా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయి [more]

Update: 2019-11-17 11:14 GMT

రకుల్ ప్రీత్ కి తెలుగులో మన్మధుడు 2 భారీ డిజాస్టర్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ పక్కన కుర్ర హీరోయిన్ గా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయి నటించినా అది అంతగా క్లిక్ అవలేదు. అయినా అమ్మడుకి బాలీవుడ్ మీద ఆశ చావలేదు. ఎలాగూ టాలీవుడ్ లో ఖాళీగానే ఉంటున్నా కదా.. అందుకే బాలీవుడ్ లో ఎలాంటి అవకాశం వచ్చినా పర్లేదు అనుకున్నట్టుగా ఉంది అమ్మడు వ్యవహారం. తాజాగా రకుల్ నటించిన మర్జావా సినిమా బాలీవుడ్ లో విడుదలై నెగెటివ్ టాక్ సొంతం చేసుకుంది. రకుల్ ది ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర కాదు కానీ.. ఈ సినిమాలో వేశ్య పాత్రలో బోల్డ్ గా నటించింది.

ఈ మర్జావా సినిమా కోసం రకుల్ బాలీవుడ్ లో చేసిన ప్రమోషన్స్ అన్ని ఇన్ని కావు. అయితే రకుల్ చేసిన ఆ ప్రమోషన్స్ కి సినిమా కి హిట్ టాక్ పడితే బావుండేది. ఇక సినిమాలో రకుల్ చేసిన వేశ్య పాత్రని, సినిమా ని కలిపి బాలీవుడ్ క్రిటిక్స్ చీల్చి చెండాడుతున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ లాంటి పేరున్న హీరోలు నటించిన చిత్రమే అయినా.. సినిమా టాక్ బట్టి కలెక్షన్స్ ఉంటాయి. అసలు సినిమాలో విషయం లేకపోతే అందాల ఆరబోసినా వేస్ట్ అని ఇప్పటికే రకుల్ ప్రీత్ కి అనుభవంలోకి వచ్చింది. అయినా అమ్మడుకి ఎదో మూల ఓ ఆశ. అందుకే ఇంకా బాలీవుడ్ అవకాశాల కోసం జీరో సైజ్ లోకి మారిపోయి మరీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ అమ్మడుకి అక్కడ బాలీవుడ్ లో కూడా ఎప్పటికపుడు షాకిస్తూనే ఉంది. మరి తెలుగులో ఎంత త్వరగా ఫెడవుట్ అయ్యిందో.. బాలీవుడ్ లోను అమ్మడుకి అదే పరిస్థితి వచ్చేలా కనబడుతుంది.

Tags:    

Similar News