ముంబై వీధుల్లో నుండి.. అమెరికా దాకా.. 'లైగర్' ట్రైలర్ అదిరిపోయింది

ముంబై వీధుల్లో నుండి.. అమెరికా దాకా.. 'లైగర్' ట్రైలర్

Update: 2022-07-21 06:28 GMT

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'లైగర్‌' ట్రైలర్‌ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌ విడుదల చేశారు. 'ఒక లైయన్‌కి, టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ వాడు' అంటూ సాగే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. విజయ్‌ నత్తితో ఇబ్బంది పడుతున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. రమ్యకృష్ణ పాత్ర సినిమాకే హైలైట్ అవ్వబోతోందని తెలుస్తోంది. ఆమె విజయ్‌కి తల్లి పాత్ర పోషించగా, హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఒక సాధారణ కుర్రాడు.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ తో దూసుకుపోతూ ఉంటాడు. ఆఖర్లో మైక్ టైసన్ డైలాగ్ కూడా మాంచి ఇంపాక్ట్ ఇస్తోంది. ఫైటర్ అంటూ చెప్పుకుని.. చివరికి ఏమయ్యాడు అనేదే.. తెలియాల్సి ఉంది. ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు.

పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


Full View


Tags:    

Similar News