'యానిమల్' స్టోరీ ముందుగానే చెప్పేసిన పేర్ని నాని.. మీమ్ వీడియో వైరల్..

సందీప్ రెడ్డి, రణబీర్ కపూర్ ‘యానిమల్’ మూవీ స్టోరీని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఆల్రెడీ లీక్ చేసేశారంటూ ఒక మీమ్ వీడియో వైరల్ అవుతుంది.

Update: 2023-10-01 12:00 GMT

టాలీవుడ్ దర్శకుడు 'సందీప్ రెడ్డి వంగ' బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తో తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ 'యానిమల్' (Animal). గ్యాంగ్ స్టార్ నేపథ్యంతో వస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవల ఒక టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ చూస్తే.. సినిమా కథ తండ్రి కొడుకుల బంధం చుట్టూ తిరగబోతుందని తెలుస్తుంది. అయితే ఈ మూవీ స్టోరీని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఆల్రెడీ లీక్ చేసేశారంటూ ఒక మీమ్ వీడియో వైరల్ అవుతుంది.

గతంలో పేర్ని నాని ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. "మంచాన పడిన ఒక తండ్రి చనిపోయే సమయంలో తన కొడుకుని పిలిచి ఒక మాట చెప్పాడంట. ఇంతవరకు నేను ఎవరితో మంచి అనిపించుకోలేదు.నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేలా చెయ్యి అని కొడుకుని తన అడిగాడట. అయితే ఎన్నో దుర్మార్గాలు చేసిన తండ్రి పేరుని ఎలా మంచి చేయాలని ఆలోచిస్తున్న కొడుకుకి ఒక ఆలోచన వచ్చింది. తండ్రికి మించిన దుర్మార్గాలు చేస్తే.. ప్రజలు కొడుకు కన్నా తండ్రే మంచి వాడు అని అంటారు అని భావించి ఎన్నో దుర్మార్గాలు చేయడం మొదలు పెట్టాడంట" అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ ప్రెస్ మీట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకి తీసి.. 'యానిమల్ స్టోరీ ఇదే అనుకుంటా, పేర్ని ముందుగానే లీక్ చేశారా' అంటూ మీమ్స్ చేస్తున్నారు మీమర్స్. యానిమల్ స్టోరీ అదేనా..? ఏమో..? తెలియదు గాని మీమర్స్ చేసిన మీమ్స్ కి మాత్రం ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఆ మీమ్ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.
కాగా ఈ మూవీలో రణబీర్ కి తండ్రిగా అనిల్ కపూర్ నటిస్తున్నాడు. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్, బబ్లూ పృథ్వీరాజ్ విలన్ రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీని డిసెంబర్ 1న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.


Tags:    

Similar News