ఆ క్రేజ్ కోసం ఏమైనా చేసేలా ఉన్నారు
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో.. కానీ సినిమాల్లో మాత్రం భీభత్సమైన క్రేజ్. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాతలు పవన్ తో ఒక్క సినిమా అంటూ వెంటబడుతున్నారు. [more]
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో.. కానీ సినిమాల్లో మాత్రం భీభత్సమైన క్రేజ్. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాతలు పవన్ తో ఒక్క సినిమా అంటూ వెంటబడుతున్నారు. [more]
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో జీరో.. కానీ సినిమాల్లో మాత్రం భీభత్సమైన క్రేజ్. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాతలు పవన్ తో ఒక్క సినిమా అంటూ వెంటబడుతున్నారు. అలాగే పవన్ పెట్టె కండీషన్స్ కి గొర్రెల్లా తలూపుతున్నారు. పవన్ క్రేజ్ ముందు ఏదైనా దిగదుడుపే అంటూ పవన్ కండీషన్స్ కి తలొగ్గుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాని రెండు కళ్ళలా భావిస్తున్నాడు. ఏది వర్కౌట్ అవ్వుద్దో తెలియదు కానీ.. పొద్దున్న షూటింగ్, సాయంత్రం రాజీయం అంటూ హడావిడి చేస్తున్నాడు. రాజధాని అమరావతిలోనే ఉంచితే బిజిపితో పొత్తు అంటాడు… పింక్ రీమేక్ లాయర్ సాబ్ కోసం మేకప్ వేస్తాడు.
అది సరే సినిమా కోసం రోజులో గంటో రెండు గంటలో మాత్రం షూటింగ్ కి టైం ఫిక్స్ చేసాడట పవన్ కళ్యాణ్. మరి గట్టిగా ఉండే దిల్ రాజు కూడా పవన్ క్రేజ్ ముందు ఆ ప్రపోజల్ కి ఒప్పేసుకున్నాడు. పింక్ రీమేక్ కాదు.. మరోపక్క క్రిష్ సినిమాకి రేపు 27 నే ముహూర్తం పెట్టాడట పవన్. క్రిష్ తో జానపద చిత్రం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం మరో గంట మాత్రమే దర్శకనిర్మాతలకు ఇస్తున్నాడట. అసలు పవన్ సినిమా చెయ్యడమే పుణ్యం అన్నట్టుగా ఆ సినిమా నిర్మాత కూడా పవన్ కండిషన్ కి తలూపేశాడు. పవన్ – క్రిష్ సినిమా రేపు 27 న చాలా సైలెంట్ గా సెట్స్ మీదకెళ్లబోతుందని.. పింక్ రీమేక్ తో పాటుగా, పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా కూడా పూర్తి చేయబోతున్నాడట. మరి పవన్ క్రేజ్ ని వాడుకోవడానికి నిర్మాతలు పవన్ చెప్పినదానికి అడ్డే చెప్పడం లేదు మరి.