Pawan Kalyan : "ఉస్తాద్" తో ఫ్యాన్స్ కు ఫుల్లు మీల్స్.. మరో గబ్బర్ సింగ్
పవన్ కల్యాణ్ రాజకీయాలను చూసుకుంటూనే తాను అంతకు ముందు అంగీకరించిన మూవీలను పూర్తిచేసే పనిలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయాలను చూసుకుంటూనే తాను అంతకు ముందు అంగీకరించిన మూవీలను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. జూన్ 12వ తేదీన హరిహరవీర మల్లు థియేటర్లలో విడుదలవుతుంది. ఇటురాజకీయంగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ తాను ఎన్నికలకు ముందు అంగీకరించిన, అగ్రిమెంట్ చేసిన మూవీలను పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఏ సభలకు వెళ్లినా ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ కేకలు పెడుతున్నారు.
రాజకీయాల్లో బిజీగా ఉంటూనే...
ఇక తాజాగా తాను అగ్రిమెంట్ చేసుకున్న అన్ని సినిమాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. పవన్ కల్యాణ్ మూవీ కోసం ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ పవన్ కల్యాణ్ కు సినిమాల కంటే రాజకీయాలే ఎక్కువ ఇష్టం. ప్రజల్లో కలసి పోవడంతో పాటు వారి సమస్యలన పరిష్కరించడం కోసం ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఇటు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తూనే మరొక వైపు మూవీలను పూర్తి చేయడానికి రెడీ అంటూ పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ మేరకు నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా చెప్పేయడంతో ఇక వేగంగా షూటింగ్ లు చేయనున్నారు.
జూన్ నెల నుంచి...
హరిహర వీరమల్లు సినిమా విడుదల కాకముందే పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు ఓకే చెప్పారు. జూన్ నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటున్న సమయంలో ఈ సినిమాకు ముందుగానే బజ్ ఏర్పడింది. పోలీస్ అధికారి పాత్రలో ఈ మూవీ పవన్ కల్యాణ్ కనిపిస్తుండటంతో మరో గబ్బర్ సింగ్ లా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న సినిమా శ్రీలీల కథానాయిక. దీనికి సంబంధించిన కథ, ప్రీ పొడక్షన్ పనులు కూడా పూర్తి కావడంతో ఇక ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలోనే వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు