ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా.. మీకో అప్డేట్..!

సినిమా అప్డేట్ కు సంబంధించిన ప్రీ పోస్టర్‌ అని చెబుతున్నారు. ఇందులో కత్తి పట్టుకున్న ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు.

Update: 2022-05-19 11:09 GMT

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చేస్తోంది. తారకరాముడు నటించబోయే 30వ సినిమా గురించిన ఏ చిన్న వార్త వచ్చినా అభిమానుల్లో ఫుల్ సెన్సేషన్ అవుతుంది. రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో జూనియర్ ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ సందడి ఈరోజు నుండే మొదలుకానుంది. కొరటాల శివతో చేయబోతోన్న 30వ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతోంది. అలానే ప్రశాంత్ నీల్‌తో చేయబోతోన్న 31వ ప్రాజెక్ట్ అప్డేట్ కూడా రానుంది. గురువారం సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు NTR 30 అప్డేట్ రానుంది. సినిమా టైటిల్ అయ్యుండొచ్చనే ప్రచారం సాగుతూ ఉంది. ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాకు సంబంధించిన ఓ పోస్టర్ వైరల్ అవుతూ ఉంది.

సినిమా అప్డేట్ కు సంబంధించిన ప్రీ పోస్టర్‌ అని చెబుతున్నారు. ఇందులో కత్తి పట్టుకున్న ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. పూర్తిగా లుక్‌ను రివీల్ చేయలేదు. కొరటాల ఈసారి పూర్తీ మాస్ సబ్జెక్టు తో వస్తున్నాడని ఈ చిన్న పోస్టర్ ను చూస్తుంటే అర్థం అవుతూ ఉంది. ఆచార్య ఇచ్చిన నెగటివ్ వైబ్స్ ను కొరటాల ఎన్టీఆర్ పుట్టినరోజు పోస్టర్స్ నుండే వదిలించుకోవాలని చూస్తూ ఉన్నాడు.
ఆర్ఆర్ఆర్ సూపర్ సక్సెస్, అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ ను దేశం మొత్తం మెచ్చుకుంటూ ఉంది. మే 20న ఎన్టీఆర్ తన 39వ పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నాడు. ఎన్టీఆర్ 30 సినిమాను రేపే మొదలుపెట్టనున్నట్లు సమాచారం. జూలైలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 'ఎన్టీఆర్ 30' సినిమాని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. కమర్షియల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందించనుంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒక బాలీవుడ్ నటి కథానాయికగా నటించబోతోందనే కథనాలు కూడా వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్‌ ఫస్ట్ లుక్ పోస్టర్‌ కోసం ఇప్పటికే వెయిటింగ్ మొదలైంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. ఈ సినిమా 2023 మేలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.


Tags:    

Similar News