ఓటీటీలో శ్యామ్ సింగరాయ్.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా !

నాని - సాయిపల్లవి - కృతిశెట్టిలు హీరోహీరోయిన్లుగా.. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

Update: 2022-01-08 12:10 GMT

కరోనా కారణంగా చాలా సినిమాలు ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలై కలెక్షన్లు రాబట్టినా.. విడుదలైన నెలరోజుల్లోపే ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇప్పటికే పుష్ప, వరుడు కావలెను, లక్ష్య సినిమాలు పలు ఓటీటీల్లో స్ట్రీమ్ అవుతుండగా.. జనవరి 14వ తేదీ నుంచి బాలయ్య అఖండ స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. తాజాగా.. నేచురల్ స్టార్ నాని సినిమా కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

నాని - సాయిపల్లవి - కృతిశెట్టిలు హీరోహీరోయిన్లుగా.. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చారు. 70వ దశకంలో జరిగిన ఓ కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 21వ తేదీ నుంచి శ్యామ్ సింగరాయ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుందంటూ వార్తలొస్తున్నాయి.





Tags:    

Similar News