నాని "దసరా" టీజర్.. సరికొత్తగా నాని లుక్

నాని ఇంతవరకూ పక్కా మాస్ లుక్ లో కనిపించింది లేదు. ఈ సినిమాతో నేచురల్ స్టార్.. మాస్ స్టార్ గా కనిపించనున్నాడు.

Update: 2023-01-30 11:38 GMT

nani dasara teaser

నేచురల్ స్టార్ నాని హీరోగా.. పక్కా ఊరమాస్ సినిమాగా తెరకెక్కుతోంది "దసరా". శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి చిత్రాల తర్వాత నాని నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా నుండి ఇప్పటికే నాని పోస్టర్లు విడుదలవ్వగా.. దసరా పై భారీ అంచనాలున్నాయి. నాని ఇంతవరకూ పక్కా మాస్ లుక్ లో కనిపించింది లేదు. ఈ సినిమాతో నేచురల్ స్టార్.. మాస్ స్టార్ గా కనిపించనున్నాడు. 1980 తెలంగాణలోని సింగరేణి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

సినిమాను చాలావరకూ సహజమైన లొకేషన్లలో తీస్తుండటం ప్లస్ పాయింట్ కానుంది. సింగరేణి నేపథ్యంలో చోటుచేసుకున్న సంఘటనలు కళ్లకు కట్టినట్లు చూపించనున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మార్చి 30వ తేదీన "దసరా" సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా.. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఈ ఈవెంట్ ను మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించారు.
టీజర్లో నాని వన్ మ్యాన్ షో తో ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని గెటప్, మునుపెన్నడూ వినని అచ్చమైన తెలంగాణ యాసతో నాని మెస్మరైజ్ చేశాడు. టీజర్ చివరిలో నోటిలో కత్తిపెట్టుకుని కనిపించే సీన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

Full View

Tags:    

Similar News