కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య

Update: 2022-10-20 08:15 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' అనే టాక్ షో తో అలరిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. సీజన్ 2 తొలి ఎపిసోడ్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరయ్యారు. రెండో ఎపిసోడ్ లో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఈ ఫుల్ ఎపిసోడ్ త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమోలను రిలీజ్ చేశారు. సెకండ్ ప్రోమోలో బిగ్ ఇన్సల్ట్ మీ లైఫ్ లో ఏంటి అని హీరో సిద్ధుని బాలయ్య అడగ్గా.. మొహం మీద మార్చలేసుకొని నువ్వు హీరో అవుతావా అంటూ నవ్వారు అని చెప్పాడు.. దాంతో బాలయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నువ్వు చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అంటూ సిద్దు చెప్తుండగానే అతడ్ని హగ్ చేసుకున్నారు బాలయ్య. విశ్వక్ సేన్ లైఫ్ లో వచ్చిన బిగ్ ట్రబుల్ ఏంటి అని అడగ్గా.. తన అక్క హాస్పటల్ లో జాయిన్ అయ్యారని.. రాత్రి 1 గంటవరకు హాస్పటల్లో ఉండి ఉదయాన్నే 6 కి సెట్ కు వెళ్లానని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. ఓటీటీలో అన్ స్టాపబుల్ రికార్డ్ వ్యూస్‌తో దూసుకుని పోతుండగా.. రెండో ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలు మరింత ఆకట్టుకుంటూ ఉన్నాయి.


Tags:    

Similar News