కథ బావున్నా డైరెక్షన్ లోపం!

నాగ శౌర్య నర్తనశాల డిజాస్టర్ తర్వాత అశ్వత్థామ సినిమాతో నిన్న శుక్రవారాం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సొంత ప్రొడక్షన్ లో నాగ శౌర్య ఫ్రెండ్ తెరకెక్కించిన అశ్వద్ధామ [more]

Update: 2020-02-01 04:18 GMT

నాగ శౌర్య నర్తనశాల డిజాస్టర్ తర్వాత అశ్వత్థామ సినిమాతో నిన్న శుక్రవారాం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సొంత ప్రొడక్షన్ లో నాగ శౌర్య ఫ్రెండ్ తెరకెక్కించిన అశ్వద్ధామ సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాలేదు. నాగ శౌర్య కథ అందించిన ఈ సినిమాకి మంచి బడ్జెట్ అయితే పెట్టారు. శౌర్య కూడా తన వంతు ప్రయత్నం చేసాడు. ప్రమోషన్ పరంగాను నాగ శౌర్య కష్టపడ్డాడు. అయితే సినిమాలో కథ చాల బావున్నప్పటికీ.. రమణ తేజ డైరెక్షన్ లోపం తో వీక్ స్క్రీన్ ప్లే తో సినిమా కి ప్లాప్ టాక్ వచ్చేసింది. సినిమాలో నాగ శౌర్య నటన, లుక్స్, కథ, యాక్షన్ సీక్వెన్స్ బావున్నపటికి.. నేరేషన్, దర్శకత్వ లోపం, సెకండ్ హాఫ్ అన్ని సినిమాకి మైనస్ అయ్యాయి.

మరి అశ్వద్ధామకి ప్రేక్షకులే కాదు రివ్యూ రైటర్స్ కూడా యావరేజ్ మార్కులేశారు. మరి ఛలో లాంటి సాలిడ్ హిట్ తర్వాత నాగ శౌర్య నర్తనశాల డిజాస్టర్ చేసాడు. మాటిచ్చా అనే సినిమా చేసి క్రేజ్ పోగొట్టుకున్న నాగ శౌర్య ఇప్పడు సొంత కథతో కూడా హిట్ కొట్టలేకపోయాడు. మంచి ట్విస్ట్ లతో గనక సినిమాని మలిచినట్టయితే.. అశ్వద్ధామ హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు సొంత ప్రొడక్షన్ లో చేసిన ఈ సినిమా ఇలా అవడంపై నాగ శౌర్య ఫ్యామిలీ ఏమంటుందో చూడాలి.

Tags:    

Similar News