చిత్రలహరి కాదు.. కామ్రేడ్ కి కూడా కోతా?
రంగస్థలం నాన్ బాహుబలి రికార్డు ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ తరువాత వరసగా రెండు భారీ డిజాస్టర్స్ రావడంతో కొంచం వెనక్కి [more]
రంగస్థలం నాన్ బాహుబలి రికార్డు ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ తరువాత వరసగా రెండు భారీ డిజాస్టర్స్ రావడంతో కొంచం వెనక్కి [more]
రంగస్థలం నాన్ బాహుబలి రికార్డు ని సొంతం చేసుకున్న మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ తరువాత వరసగా రెండు భారీ డిజాస్టర్స్ రావడంతో కొంచం వెనక్కి తగ్గారు. రంగస్థలం కి ముందు వీరి తీసిన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్స్ కావడంతో ఎక్కడ తగ్గకుండా భారీ బడ్జెట్స్ సినిమాలు తీయడం స్టార్ట్ చేసారు.
అయితే వరసగా రెండు డిజాస్టర్స్ రావడంతో బడ్జెట్ కంట్రోల్‌లో పెట్టేసారు. ప్రస్తుతం వారు తీస్తున్న మిడిల్ రేంజ్ సినిమాలు చిత్రలహరి, డియర్ కామ్రేడ్‌కి ఆచి తూచి ఖర్చు పెడుతున్నారని తెలిసింది. ఇక మొన్నటివరకు స్టార్ డైరెక్టర్స్ కి, స్టార్ హీరోస్ అడ్వాన్స్ లు ఇచ్చి కూర్చున్న వీరు ప్రస్తుతం అటువంటివి ఏమి చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.
నష్టాలు వచ్చేప్పటికి ఇచ్చిన అడ్వాన్సులు గుర్తొచ్చి అన్నీ వెనక్కు తీసుకునే పనిలో పడ్డారు. రీసెంట్ గా బోయపాటి కి ఇచ్చిన అడ్వాన్స్ తీసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కి అయిదు కోట్లపైనే అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి వాళ్లు ఇప్పుడు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. బహుశా ఎన్నికలు తరువాత పవన్ సినిమాలు చేస్తే ఫస్ట్ మూవీ తమదే అవుతుందని నమ్మకం.