బాస్ తో బ్రేక్ ఫాస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. ఆయనతో బ్రేక్‌ఫాస్ట్ చేశారు

Update: 2023-04-24 07:47 GMT

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ గెస్ట్‌గా వచ్చారు. చిరంజీవితో కలసి ఆయన బ్రేక్ ఫాస్ట్ చేశారు. చిరంజీవి ఇంటికి దేవి శ్రీ ప్రసాద్ ను ఆహ్వానించి కడుపారా దగ్గరుండి తినిపించారు. దీంతో దేవిశ్రీ ప్రసాద్ ఖుషీ అయ్యారు. ఈ విషయాన్ని దేవి శ్రీనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

చిరు నివాసంలో....
"బాస్ తో బ్రేక్ ఫాస్ట్" అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. "థాంక్యూ... డియర్ చిరంజీవి సర్... ఎంతో ఆప్యాయంగా అల్పాహారం పెట్టారు... మీతో గడిపిన సమయం అద్భుతం సర్. మీరు ఎప్పుడూ మమ్మల్ని ఏదో ఒక ప్రత్యేకతతో సంతోష పెడుతుంటారు. అందుకే మీరు మాకు ఎల్లప్పుడూ సూపర్ డూపర్ స్పెషల్... లవ్యూ సర్" అంటూ దేవి శ్రీ స్పందించారు. ఈ మేరకు చిరంజీవి నివాసంలో తాను బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న ఫొటోలను కూడా పంచుకున్నారు


Tags:    

Similar News