Dulquer Salmaan : దుల్కర్ సినమా నిజంగానే అదృష్టవంతుడు.. నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారుగా
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నారు. తాజాగా ఆయన నిర్మించిన లోక రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నారు. తాజాగా ఆయన నిర్మించిన లోక రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలుగు ప్రేక్షకులను మహానటి, సీతా రామం, లక్కీ భాస్కర్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇప్పటికే అలరించిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, ఇప్పుడు నిర్మాతగా ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దుల్కర్ తాజా ప్రొడక్షన్ ‘కోథ లోక చాప్టర్ 1: చంద్ర’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇప్పటివరకు సుమారు పపదకొండు కోట్ల రూపాయలు వసూళ్లు సాధించి డబ్బింగ్ సినిమాల కలెక్షన్లలో రికార్డు బ్రేక్ చేసింది.
వంద కోట్లు దాటేసి...
మహిళా కథానాయికతో కూడిన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం కేరళలో ఇప్పటికే 3 కోట్ల వసూలయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలోనే ఈ చిత్రం 100 కోట్ల రూపాయలు దాటేసింది. ఇది ఇంకా కొనసాగుతూనే ఉండగా, మలయాళ సినిమాకు కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తోందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఇంకా ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని థియేటర్ కలెక్షన్లు సొంతం చేసుకుంటుందని, హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో డబ్బింగ్ సినిమాల్లో టాలీవుడ్ లో మరింత రికార్డుల దిశగా అడుగులు వేస్తుంది.
డబ్బింగ్ సినిమాల్లో రికార్డు బ్రేక్...
తెలుగులో హలో, రణరంగం వంటి చిత్రాల్లో నటించిన కల్యాణి, ఈసారి తన మలయాళ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన ప్రశంసలు అందుకున్నారు. దుల్కర్ సల్మాన్ ను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. గతంలో మహాటితో పాటు సీతారామంలోనూ ఆయన నటనకు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అలాగే లక్కీ భాస్కర్ తో హిట్ కూడా కొట్టేశారు. మరి నిర్మాతగా మారి ఈ చిత్రం మరింత వసూళ్లు రాబడుతుండటంతో నిజంగానే లక్కీ దుల్కర్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.