షాకింగ్ న్యూస్.. కన్నుమూసిన స్టార్ డైరెక్టర్
తెలుగులో నితిన్‌తో 'మారో' సినిమా చేశారు. ఇది సక్సెస్ సాధించలేదు. ఆయన దర్శకత్వం వహించిన
మలయాళ చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాల రచయిత, దర్శకుడు సిద్ధిక్ కన్నుమూశారు. ఆగస్టు 8, మంగళవారం కొచ్చిలో చనిపోయారని అధికారిక ప్రకటన వచ్చింది. శనివారం గుండెపోటు వచ్చిందని వార్తలు వచ్చాయి. ఆయనకు శ్వాసకోశ సమస్యల కారణంగా జూలై 10న ఆసుపత్రిలో చేరారు. సిద్దిక్ కథా రచయితగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'రాంజీరావు స్పీకింగ్' చిత్రంతో దర్శకుడిగా మారారు. మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. వీటిలో బాడీ గార్డ్, గాడ్ ఫాదర్, ఫ్రెండ్స్, హిట్లర్, బిగ్ బ్రదర్ బిగ్ సినిమాలు హిట్లుగా నిలిచాయి. తెలుగులో నితిన్‌తో 'మారో' సినిమా చేశారు. ఇది సక్సెస్ సాధించలేదు. ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా.. బిగ్ బ్రదర్. మోహన్ లాల్ హీరోగా నటించగా.. అర్బాజ్ ఖాన్, అనూప్ మీనన్, హనీ రోజ్ కీలక పాత్రల్లో నటించారు.
కొంతకాలంగా సిద్ధిక్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. న్యుమోనియా, కాలేయ సంబంధిత ఇబ్బందులతో చికిత్స తీసుకుంటోన్నారు. అదే సమయంలో ఈ ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో అత్యవసర చికిత్సను అందించారు. సిద్ధిక్ కన్నుమూయడం మళయాళ చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదం లోకి నెట్టింది. ఆయన వయస్సు 63 సంవత్సరాలు. భార్య సాజిత, ముగ్గురు పిల్లలు ఉన్నారు.