మహేష్ మూవీ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన సందీప్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా తరువాత సందీప్ వంగ చేస్తున్న చిత్రం ‘కబీర్ సింగ్’ . బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా ఈచిత్రం వస్తుంది. ఈసినిమా [more]

Update: 2019-06-04 06:26 GMT

అర్జున్ రెడ్డి సినిమా తరువాత సందీప్ వంగ చేస్తున్న చిత్రం ‘కబీర్ సింగ్’ . బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ గా ఈచిత్రం వస్తుంది. ఈసినిమా ప్రమోషన్స్ టైములో సందీప్ తన ఫ్యూచర్ ఫిలింస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు. మహేష్ బాబు తో తాను తీయబోయే సినిమాలో మహేష్ లోని అద్బుత నటుడిని వెలికి తీయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం ఇద్దరం వేరువేరు కమిట్మెంట్స్ ఉన్నాం. అవి కంప్లీట్ అయినా తరువాత తమ మూవీ గురించి ఆలోచిస్తాం అని చెప్పారు. ‘కబీర్ సింగ్’ తరువాత సందీప్ వంగ తను చేయబోయే నెక్స్ట్ సినిమా విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ కి వచ్చినట్లు అయితే అనిపిస్తుంది.

తన నెక్స్ట్ మూవీ ఒక భారీ క్రైమ్ డ్రామా మూవీ అంటూ చెప్పుకొచ్చాడు. సినిమాలో మ్యాటర్ ఉంటె దానికి భాష తో సంబంధం లేదని బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలు నిరూపించాయి. అందుకే తాను కూడా అలాంటి సినిమాలను తీసి అన్ని భాషల ప్రేక్షకులను నచ్చే విధంగా చేయాలనే పట్టుదలతో ఉన్నాడట. మరి ఇది ఎవరితో తీస్తాడో అన్నది మాత్రం చెప్పలేదు సందీప్. కబీర్ సింగ్ విడుదల తరువాత దీనిపై క్లారిటీ రావొచ్చేమో

Tags:    

Similar News