కామెడీ వర్కౌట్ బావుంది గనక…. 3 గంటలా.
రంగస్థలం సినిమాకి నిడివి ఎక్కువైనా పేక్షకుడికి ఎక్కడా బోర్ అనేది లేకుండా సుకుమార్ చూసుకోవడంతో.. రంగస్థలం నిడివి మీద ఎక్కడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. కానీ [more]
రంగస్థలం సినిమాకి నిడివి ఎక్కువైనా పేక్షకుడికి ఎక్కడా బోర్ అనేది లేకుండా సుకుమార్ చూసుకోవడంతో.. రంగస్థలం నిడివి మీద ఎక్కడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. కానీ [more]
రంగస్థలం సినిమాకి నిడివి ఎక్కువైనా పేక్షకుడికి ఎక్కడా బోర్ అనేది లేకుండా సుకుమార్ చూసుకోవడంతో.. రంగస్థలం నిడివి మీద ఎక్కడా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. కానీ మహర్షి సినిమాకి నిడివి ప్రాబ్లెమ్ అయ్యింది. మహర్షి సినిమా చాలా సాగదీత ఫీలింగ్ రావడంతో.. మైనస్ పాయింట్స్ లో నిడివి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చింది చాలా సినిమాలు ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిడివి ఉన్నా ఇబ్బంది ఉండదని దర్శకనిర్మాతలు ఫీల్ అవుతారు. అది చాలా కొద్దీ సినిమాలకే వర్కౌట్ అవుతుంది కానీ.. ఎక్కువ సినిమాలకు వర్కవుట్ కాదు. తాజాగా మహెష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా నిడివి కూడా 3 గంటలుండొచ్చు అని అంటున్నారు.
షూటింగ్ చివరి దశకు చేరుకున్నప్పటికీ.. పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండడం… సినిమా ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్, తియ్యాల్సిన పాటలపై మూడు గంటల నిడివి రావడం ఖాయమంటున్నారు. అయితే సెకండ్ హాఫ్ లో అనిల్ రావిపూడి కామెడీ బాగా వర్కౌట్ అయిందని, కామెడీ సీన్స్ బాగా వచ్చాయని, వాటి వల్లే సినిమా నిడివి ఎక్కువయ్యేలా ఉందని అంటున్నారు. ఎడిటింగ్ దగ్గర ఎలాగైనా 15 నిముషాలు ట్రిమ్ చెయ్యాల్సిందే… లేదంటే కష్టమంటున్నారు. అయితే ఆ ఎడిటింగ్ లో కట్ చెయ్యాల్సిన 15 నిమిషాల నిడివి బాధ్యతను దిల్ రాజుకి అప్పజెప్పినట్టుగా టాక్. ఎందుకంటే దిల్ రాజు జేడ్జ్మెంట్ మీద గురి అలాంటింది. ఆయనకు సన్నివేసాలు నచ్చకపోతే ఆ సీన్స్ ని మొహమాటం లేకుండా కట్ చేయించి పారేస్తాడు. మరి సరిలేరు ఫైనల్ నిడివి ఎంతుందో చూడాలి.