సరిలేరు లో హైలెట్ అదేనా?

మహేష్ – అనిల్ రావిపూడిల కాంబోలో తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా [more]

Update: 2020-01-08 05:55 GMT

మహేష్ – అనిల్ రావిపూడిల కాంబోలో తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా మరో మూడు రోజుల్లో విడుదలకాబోతుంది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో టీం మొత్తం బిజీగా వుంది. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ కాగా.. ఇప్పుడు రష్మిక ఇంటర్వ్యూస్, విజయశాంతి సోలో ఇంటర్వ్యూ.. రష్మిక, సంగీత, విజయశాంతి, హరితేజ పండగ స్పెషల్ ఇంటర్వ్యూస్ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడి తో సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

అయితే సరిలేరు నీకెవ్వరూ సినిమాలో కామెడీ, యాక్షన్ సమపాళ్లలో హైలెట్ అవుతుంది అనేది ట్రైలర్ లో చూస్తే అర్ధమవుతుంది. ఇక తాజాగా సరిలేరు నీకెవ్వరూ సినిమాకి ఓ మెయిన్ హైలెట్ ఉందని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కర్నూలు నేపథ్యంలో సాగుతూ క్రేజీ మాస్ ఫైట్స్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్‌లతో ఉండబోతుందట. సినిమాలో కామెడీ,యాక్షన్ సన్నివేశాలన్నిటిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తోందని సమాచారం. అలాగే ట్రైన్ ఎపిసోడ్ తో పాటుగా ప్రకాష్ రాజ్ – విజయశాంతి – మహేష్ కాంబో సీన్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయని అంటున్నారు.

Tags:    

Similar News