టాలీవుడ్‌లో ప్రస్తుతం మూడు పెద్ద సినిమాల మధ్యలో కూడా సూపర్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది మహానటి. ఓ వైపు 6వ వారంలోకి ఎంటర్ అయినా రామ్‌చరణ్ రంగస్థలం ఇంకా మెరుపులు మెరిపిస్తోంది. భరత్ జోరు ఇంకా ఉంది. నా పేరు సూర్య ప్లాప్ అయినా ఎక్కువ థియేటర్లే ఆక్రమించింది. ఇక పూరి మెహబూబాకు కూడా ఎక్కువ స్క్రీన్లే ఉన్నాయి. ఇలా ఇన్ని సినిమాల మధ్యలో చాలా తక్కువ స్క్రీన్లలోనే రిలీజ్ అయిన మహానటి హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకుపోతోంది.
మిలియన్ డాలర్ల మార్క్.....
గట్టి పోటీ మధ్య లిమిటెడ్ రిలీజ్‌గా వచ్చిన మహానటి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ వసూళ్ల దుమ్ము రేపుతోంది. ఇక ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలకు బెంచ్ మార్క్‌గా ఉన్న మిలియన్ డాలర్ల మార్క్‌ను మహానటి శనివారంతో క్రాస్ చేసేసింది. దివంగత మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మహానటి వీకెండ్‌లో చాలా ముందుగానే బుధవారమే రిలీజ్ అయ్యింది.
వీక్ డేస్ కావడంతో.....
వీక్ డేస్ కావడంతో తొలి రోజు ఓవర్సీస్‌లో అనుకున్న వసూళ్లు రాలేదు. తర్వాత బ్లాక్ బస్టర్ టాక్‌తో రెండో రోజు నుంచి క్రమంగా కలెక్షన్లు పెరిగాయి. శనివారం మిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేసిన మహానటి ఆదివారం ఓవర్సీస్ బాక్సాఫీస్‌ను కుమ్మేయనుంది. నా పేరు సూర్య, మెహబూబా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు మహానటి థియేటర్లకే ఆడియెన్స్ పోటెత్తుతున్నారు.
మరి కొన్ని సీన్లు...
ఓవర్సీస్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏ సెంటర్లలోనే కాకుండా బీ, సీ సెంటర్లలో కూడా ఈ సినిమా దుమ్ము రేపుతోంది. రెండె తెలుగు రాష్ట్రాల్లో 25 శాతం అదనంగా థియేటర్లు పెంచారు. ఇక ఈ సినిమా నిడివి ఇప్పటికే 2.56 గంటలు ఉండగా, మరో 6 నిమిషాల సీన్లు యాడ్ చేయాలని చూస్తున్నారు.