సీనియర్ హీరో మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. తన ఆనందాన్ని ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. వరస సినిమాలతో బాలీవుడ్ లో..కోలీవుడ్ లో.. టాలీవుడ్ లో బిజీగా ఉన్న మాధవన్ తన ఆనందాన్ని కారణం తన కొడుకే. అతడి కొడుకు అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నీలో భారత్ కు కాంస్యపతకం అందించాడు.
కొడుకు వేదాంత్ మాధవన్ థాయిలాండ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీ పడి మూడో స్థానంలో నిలిచి భారత్ కు కాంస్యపతకం అందించాడు. అయితే ఇదే విషయం గురించి తన ఆనందాన్ని ట్విట్టర్ అకౌంట్ లో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.
'తనతో పాటు తన భార్య సరిత గర్వించాల్సిన విషయం ఇది... మా అబ్బాయి వేదాంత్ థాయిలాండ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో మనదేశానికి కాంస్యపతకం సాధించిపెట్టాడు' అని ట్వీట్ చేసాడు మాధవన్. తన కొడుకు వేదాంత్ కాంస్య పతకంతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.