లావణ్యానికి అగ్ని పరీక్ష
టాలీవుడ్ లో అవకాశాలు లేని గ్లామర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. ప్రస్తుతం అవకాశాలు లేని లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదలకాబోతున్న [more]
టాలీవుడ్ లో అవకాశాలు లేని గ్లామర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. ప్రస్తుతం అవకాశాలు లేని లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదలకాబోతున్న [more]
టాలీవుడ్ లో అవకాశాలు లేని గ్లామర్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి ఇప్పుడు అగ్ని పరీక్ష ఎదురైంది. ప్రస్తుతం అవకాశాలు లేని లావణ్య త్రిపాఠి ఈ రోజు విడుదలకాబోతున్న అర్జున్ సురవరం మీదే ఆశలు పెట్టుకుంది. నిఖిల్ సరసన జోడి కట్టిన లావణ్యాన్ని అర్జున్ సురవరం ఏడాది నుండి పరీక్ష పెడుతూనే ఉంది. గత ఏడాది నవంబర్ నుండి ఈ ఏడాది నవంబర్ వరకు విడుదల డేట్స్ మార్చుకుంటూ వస్తున్న ఈసినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్ నటన, సినిమా ప్రమోషన్స్ బావుండడంతో అందరిలో ఈ సినిమా పై ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ సినిమా గనక హిట్ అయితే లావణ్య త్రిపాఠికి కొద్ది కాలం టాలీవుడ్ లో నిలబడే అవకాశం ఉంటుంది.
అర్జున్ సురవరం సినిమా టాక్ అటు ఇటు అయితే హీరో నిఖిల్ సంగతి తెలియదు కానీ.. లావణ్య త్రిపాఠి కి పెద్ద దెబ్బ పడినట్లే. ఈ సినిమా మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్న లావణ్య త్రిపాఠికి మరో సినిమా చేతిలో కూడా లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ డ్రెస్సులతో ఎంతగా కవ్వించినా.. లావణ్య కి అవకాశాలు రావడం లేదు. సక్సెస్ ఉంటేనే నెక్స్ట్ ఆఫర్ ఉంటుందో లేదో తెలియని ఈ రోజుల్లో… ప్లాప్ పడితే మాత్రం ఇక ఇంటికే అన్నట్టుగా తయారైంది హీరోయిన్స్ కెరీర్. మరి అర్జున్ సురవరం లావణ్యాన్ని ఏ గట్టుకు చేర్చనున్నాడో మరికాసేపట్లో తెలిసిపోతుంది