కంగనా ఎంత వెయిట్ పెరుగుతుందంటే?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రం ను ప్రముఖ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ రూపొందించనున్నారు. రాజమౌళి తండ్రి [more]
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రం ను ప్రముఖ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ రూపొందించనున్నారు. రాజమౌళి తండ్రి [more]
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. ఈ చిత్రం ను ప్రముఖ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ రూపొందించనున్నారు. రాజమౌళి తండ్రి ప్రముఖ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో ఈ మూవీని తీస్తున్నారు. ఇక ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం ఆమె తమిళం నేర్చుకోవడంతో పాటు 10 కిలోలు వరకూ బరువు కూడా పెరగనుందని తెలుస్తుంది.
ఎంజీఆర్ పాత్రలో….
జయలలిత పాత్ర చాలా ఇన్స్పిరేషన్ అని అందుకే ఆమె పాత్రకు పూర్తి న్యాయం జరగాలంటే ఇలాంటివి తప్పవు అంటుంది ఈ క్వీన్. ఇందులో మరో కీలకమైన పాత్ర అయిన ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నాడు. అలానే మరో ముఖ్య పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ పాత్రలకు సంబంధించి టెస్ట్ షూట్స్ కూడా అయిపోయినట్టు తెలుస్తుంది.ఇక ఈమూవీ కథ లో జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఈమూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా కానుంది. అయితే ఈమూవీ ఎప్పటినుండి స్టార్ట్ అవుతుందో తెలియాల్సిఉంది.