పవర్‌ఫుల్‌గా రజనీ 'హుకుం' ప్రోమో

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'జైలర్‌'. ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్‌ సింగిల్ 'హుకుం' ప్రోమో విడుదల అయ్యింది

Update: 2023-07-16 12:12 GMT

సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'జైలర్‌'. ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్‌ సింగిల్ 'హుకుం' ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో రజనీకాంత్‌ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ''ఏయ్.. ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నా ఇష్టం వచ్చినప్పుడు మారుస్తూనే ఉంటా. అప్పుడు గప్‌చుప్‌గా వాటిని ఫాలో అవుతూనే ఉండాలి. అది కాకుండా హడావుడిగా ఏమైనా చేస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తాను. ఇది హుకుం. టైగర్‌ కా హుకుం (తమిళ డైలాగ్‌కు తెలుగు ట్రాన్స్‌లేషన్)'' అని ప్రోమోలో రజనీకాంత్‌ పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. ఇక ఆ డైలాగ్‌కు అనిరుథ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అంతే ఎఫెక్టివ్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి సాంగ్‌ రేపు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన 'కావాలా' సాంగ్‌ బాగా వైరల్‌ అయ్యింది.

అటు తమిళంలో 'జైలర్‌' సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. రేపు 'హుకుం' సాంగ్‌ రిలీజ్‌ కానుండగా, త్వరలోనే ఈ మూవీ ట్రైలర్‌ కూడా రిలీజ్‌ అవుతుందని తెలుస్తోంది. అయితే తెలుగు 'జైలర్‌' ప్రమోషన్స్‌ పెద్దగా ప్రారంభించలేదు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ కీ రోల్స్‌లో నటిస్తున్నారు. వీరితో పాటు హిందీ నటుడు జాకీ ష్రాఫ్, తెలుగు నటుడు సునీల్, రమ్య కృష్ణ, తమన్నా, వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మరిముత్తు, నమో నారాయణ, రిత్విక్, అనంత్, శరవణన్, అరంతాంగి నిషా, మహానటి శంకర్, కలై అరసన్ ఈ సినిమాలో నటించారు. ఈ మూవీ షూటింగ్‌ ఇప్పటికే పూర్తైంది. 

Tags:    

Similar News