యూట్యూబ్ ట్రెండింగ్స్ నుండి హిట్ 2 టీజర్ తొలగింపు.. కారణమిదేనన్న అడివి శేష్

ఇప్పుడు అదే.. హిట్ 2 టీజర్ ను యూట్యూబ్ ట్రెండింగ్ నుండి తొలగించడానికి కారణమైంది. దీనిపై అడివి శేష్ స్పందిస్తూ..

Update: 2022-11-09 13:46 GMT

hit 2 teaser out from youtube trendings

విశ్వక్సేన్ హీరోగా 2020లో 'హిట్ ది ఫస్ట్ కేస్' అనే క్రైమ్ థిల్లర్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు దర్శకుడు శైలేష్ కొలను. ప్రస్తుతం హిట్ 2 ని అడివి శేష్ తో తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది మూవీ టీమ్. ఒక్క టీజర్ తోనే సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది చిత్రబృందం. టీజర్లో అడివి శేష్ యాక్టింగ్ అందరికీ నచ్చింది కానీ.. టీజర్ చివర్లో చూపించిన సీన్ మాత్రం అందరినీ భయపెట్టింది. ఆ సీన్లో ఒక యువతి శరీర భాగాలను ముక్కలు చేసినట్లు చూపించారు.

ఇప్పుడు అదే.. హిట్ 2 టీజర్ ను యూట్యూబ్ ట్రెండింగ్ నుండి తొలగించడానికి కారణమైంది. దీనిపై అడివి శేష్ స్పందిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేశాడు. "టీజర్ లో హింసాత్మక సన్నివేశాలు ఉండడంతో యూట్యూబ్ హిట్-2 టీజర్ ని ట్రేండింగ్ లిస్ట్ ని నుంచి తొలిగించింది. అంతేకాకుండా 18 ఏళ్ళ వయసు కంటే తక్కువ వయసు ఉన్న వారు చూడకుండా ఏజ్ రెస్ట్రిక్షన్ కూడా పెట్టింది. భవిషత్తులో ఈ టీజర్ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో సైన్ ఇన్ అయ్యి చూడాల్సిందే" అని తెలిపాడు. ఈ సినిమాలో కేవలం వైలెన్స్ కాదు.. రొమాన్స్ కూడా ఉందని, రేపు ఫస్ట్ సింగిల్ ఉరికే ఉరికే పాట విడుదల కాబోతున్నట్లు తెలిపాడు.


Tags:    

Similar News