పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రిలీజ్ డేట్ వచ్చేసింది

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. అందింది హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

Update: 2025-06-17 08:05 GMT

పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 25వ తేదీన హరిహరవీరమల్లు సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. తొలుత ఈ నెల 12వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడింది. వాయిదాకు కారణాలు తెలియకపోయినప్పటికీ పోస్ట్ ప్రొడక్సన్ పనులు పెండింగ్ లో ఉండటం వల్ల హరిహర వీరమల్లు వాయిదా పడిందని చెబుతున్నారు.

వాయిదా పడి...
మొన్నటి వరకూ రిలీజ్ తేదీ తెలియక అభిమానులు కూడా ఒకింత ఆందోళనకు గురయ్యారు. అయితే తాజాగా హరిహరవీరమల్లు మూవీని ఈ నెల 25వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో థియేటర్లలో ఈ మూవీ విడుదలయి అభిమానులను అలరించనుంది. ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్నపవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు తీపి కబురు అందింది.


Tags:    

Similar News