చిరు ఇంటి ఎదుట రైతులు నిరసన

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా సైరా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్ర షూటింగ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఊరిలో కొన్నిరోజులు పాటు జరిగింది. షూటింగ్ జరిగిన్నప్పుడు [more]

Update: 2019-07-01 06:32 GMT

మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా సైరా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈచిత్ర షూటింగ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఊరిలో కొన్నిరోజులు పాటు జరిగింది. షూటింగ్ జరిగిన్నప్పుడు పంట నష్టం జరిగింది. అయితే ఆ టైములో పంట నష్ట పరిహారాలు చెల్లిస్తామని యూనిట్ సభ్యులు మాటా ఇచ్చారంట. తమకు పంట నష్ట పరిహారం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారని వారు పేర్కొన్నారు.

అయితే ఇంతవరకు పంట నష్ట పరిహారం చెల్లించకపోవడంతో పాటు…ఆ ఒప్పందం చెల్లదని ఇప్పుడు చెబుతున్నారని వారు వాపోయారు. అందుకే దీనికి నిరసనగా ఆ రైతులు చిరంజీవి ఇంటి ముందు నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అండ్ చిరు ఎటువంటి స్పందన ఇవ్వలేదట. అక్కడికి వచ్చినా పోలీసులు వారికి సర్ది చెప్పి వారిని పంపించేశారని చెబుతున్నారు. ఇక ఈచిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది

Tags:    

Similar News