SSMB 29 Update : మహేశ్ బాబు ఫ్యాన్స్ కు తెలియజేయునది ఏమనగా
బాక్సాఫీసును రికార్డును తానే బద్దలు కొట్టే దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న SSMB 29 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాక్సాఫీసును రికార్డును తానే బద్దలు కొట్టే దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న SSMB 29 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహజంగా రాజమౌళి సినిమా అంటే సుదీర్ఘకాలం షూటింగ్ కొనసాగుతుంది. అంతే సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ కు కూడా తీసుకుంటారు. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్ని రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టేస్తుందని, పాన్ ఇండియా మూవీగా ఈ మూవీ మరో హిస్టరీని క్రియేట్ చేస్తుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
బర్త్ డే రోజున...
అయితే మహేశ్ బాబు బర్త్ డే రోజున SSMB 29 నుంచి క్రేజీ అప్ డేట్ వస్తుందని అందరూ భావించారు. అందుకు అనుగుణంగానే రాజమౌళి ప్రిన్స్ ఫ్యాన్స్ కు తీపికబురు అందించాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈ ఏడాది నవంబర్ లో విడుదల చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. దీంతో పాటు తాజాగా ఒక పోస్టర్ ను కూడా రాజమౌళి రిలీజ్ చేసి మరింత హైప్ క్రియేట్ చేశాడు. అంతటితో ఆగకుండా రాజమౌళి మహేశ్ ఫ్యాన్స్ కు ఒక లేఖ కూడా రాయడం విశేషం.
నవంబరులో ఫస్ట్ లుక్...
SSMB 29 కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు, మహేశ్ బాబు ఫ్యాన్స్ కు తెలియజేయునది ఏమనగా SSMB 29 ప్రాజెక్టు ప్రారంభించి చాలా రోజులయిందని, ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుందని, అయితే భారీ ప్రాజెక్టు కావడంతో కేవలం కొన్ని ఫొటోలు, మీడియా సమావేశాలతో ముగించబోనని, అలా చెప్పడం కూడా సాధ్యం కాదని రాజమౌళి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. భారీ ఎత్తున రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ ఏడాది నవంబరులో మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామని చెప్పి మరింత ఆసక్తిని రాజమౌళి ఫ్యాన్స్ లో రేకెత్తించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కూడా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని రాజమౌళి కాన్ఫిడెస్స్ తో చెప్పడం చూసి మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.