ఈటివి జబర్దస్త్ కి ఈటీవీ నే షాకిచ్చిందా?
ఇప్పటివరకు ఈ టివి లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ని ఏ ఛానల్ షో అయినా చెక్ పెట్టలేకపోయింది. జబర్దస్త్ షో ఎక్స్ట్రా జబర్దస్ షో ఎప్పుడు [more]
ఇప్పటివరకు ఈ టివి లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ని ఏ ఛానల్ షో అయినా చెక్ పెట్టలేకపోయింది. జబర్దస్త్ షో ఎక్స్ట్రా జబర్దస్ షో ఎప్పుడు [more]
ఇప్పటివరకు ఈ టివి లో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ని ఏ ఛానల్ షో అయినా చెక్ పెట్టలేకపోయింది. జబర్దస్త్ షో ఎక్స్ట్రా జబర్దస్ షో ఎప్పుడు టాప్ లోనే ఉండేవి. కరోనా లాక్ డౌన్ లోను పాత స్కిట్స్ తోనే ఈటివి యాజమాన్యం మేనేజ్ చేసింది. కామెడీ షో కనక మళ్ళీ మళ్ళీ చూస్తారు. లాక్ డౌన్ తర్వాత కూడా కొత్త ఉత్సాహంతో జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లు రెండూ మళ్ళీ టాప్ ప్లేస్ లోకి వచ్చేసాయి. హైపర్ ఆది పంచెస్, సుడిగాలి సుదీర్ లవ్ పాటలు, కొత్తగా తాగుబోతు రమేష్, మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన షకలక శనకర్ అందరూ కొత్త కొత్తగా కామెడీ చేస్తూ జబర్దస్త్ స్టేజ్ ని అల్లాడిస్తున్నారు.
అయితే ఇప్పుడు అలాంటి ఈటివి జబర్దస్త్ కి ఈటివి నే చెక్ పెట్టిన విషయం ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ గా వినిపిస్తున్న న్యూస్. ఎలా అంటే ఈటివి న్యూస్ తో ఈటివి జబర్దస్త్ షో రేటింగ్ కంపేర్ చేస్తే.. ఈటివి న్యూస్ టీఆర్పీ రేటింగ్ జబర్దస్త్ రేటింగ్ కన్నా ఎక్కువ ఉందట. తాజాగా బార్క్ ప్రకటించిన రేటింగ్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో కు గట్టి షాక్ ఇచ్చింది ఈటీవీ న్యూస్. మరి ఎప్పుడో ఉదయం 7 గంటలకొకసారి, అలాగే రాత్రి 9 గంటలకొకసారి ప్రసారమయ్యే ఈటివి న్యూస్ జబర్దస్త్ ని క్రాస్ చెయ్యడం కాస్త విడ్డూరమే. ఎందుకంటే ఇప్పుడు ఏ టైం లో అయినా లైవ్ అప్ డేట్స్ తో టివి 9, ఎన్టీవీ, ఏబీఎన్ ఇలాంటి ఛానల్స్ వేసిన న్యూస్ వేసి చికాకు పెడుతున్నాయి. అలాంటిది ఈటీవీలో న్యూస్ చూసే వాళ్ళు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది కదూ… మరి వినడానికి విడ్డూరంగా ఉన్నా ప్రస్తుత కరోనా పరిస్థితుల వలన ఈటివి న్యూస్ కి బాగా ప్రాధాన్యత పెరిగింది అని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.