రోజా స్పెషల్ ప్రోగ్రాం ట్రేడింగ్ లో ఉందా
పండగ స్పెషల్ అంటూ ఈటివి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాంని చేసి… పండగ రోజు ఉదయం తొమ్మిదిగంటలకు ప్రసారం చేస్తుంటుంది. గతంలో ఇలానే సుధీర్ – రష్మీ [more]
పండగ స్పెషల్ అంటూ ఈటివి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాంని చేసి… పండగ రోజు ఉదయం తొమ్మిదిగంటలకు ప్రసారం చేస్తుంటుంది. గతంలో ఇలానే సుధీర్ – రష్మీ [more]
పండగ స్పెషల్ అంటూ ఈటివి ఎప్పుడు ఏదో ఒక ప్రోగ్రాంని చేసి… పండగ రోజు ఉదయం తొమ్మిదిగంటలకు ప్రసారం చేస్తుంటుంది. గతంలో ఇలానే సుధీర్ – రష్మీ ల పెళ్లి గోల అంటూ ఈ టివి లో ప్రసారం అయినా సుధీర్ గాడి పెళ్లి అనే ప్రోగ్రాం టాప్ వన్ లో నిలిచింది. తాజాగా కామెడిన్స్, సింగర్స్, డాన్స్ మాస్టర్స్ ఇలా అందరూ ఓ చోట చేరి ఆడవారి పార్టీలకుఅర్ధాలే వేరులే అంటూ జనవరి 1 న న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాం చేశారు. ఆ ప్రోగ్రాం జనవరి 1 ఈటీవీలో ఉదయం 9 గంటలకు ప్రసారం అయ్యింది. ఆ షో లో హాట్ యాంకర్ వర్షిణి, హైపర్ ఆది యాంకరింగ్స్ చెయ్యగా.. సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ లాంటోళ్ళు కామెడీతోనూ, జాఫర్ స్పెషల్ ఇంటర్వ్యూ తోనూ, సింగర్స్ టాప్ సాంగ్స్ తోనూ, జానీ మాస్టర్ అదరగొట్టే డాన్స్ తోనూ అదరగొట్టేసాడు. ప్రోమోస్ తోనే ఈ షో పై ఇంట్రెస్ట్ పెంచిన ఈటివి ఆ ప్రోగ్రాంతో ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండింగులోకొచ్చేసింది.
నాగబాబు లేకపోయినా రోజా లీడర్ షిప్ లో ఈ ప్రోగ్రాం నిజంగా అదిరింది. ఫ్యామిలీ అంతా చూడదగ్గ ప్రోగ్రాంగా ఈ ఆడవారి మాటలకు ఆర్ధాలే వేరులే ఉంది. రోజా ఆధ్వర్యంలో రెండు గ్రూపులుగా ఉండి.. న్యూ ఇయర్ సందర్భంగా చేసిన హంగామా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అందుకు తగ్గట్టుగానే ఆడియన్స్ నుంచి ఈ ప్రోగ్రామ్‌కు మంచి స్పందనే వచ్చింది. యూట్యూబ్‌లో ఈ ప్రోగ్రామ్‌ను అప్‌లోడ్ చేస్తే… ఒక్కరోజునే యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో 2nd ప్లేస్‌లోకి వచ్చేసింది. మరి మహేష్ సరిలేరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సాంగ్స్ ని వెనక్కి నెట్టి ఈటివి ఆడవారి మాటలకూ అర్ధాలే వేరులే ప్రోగ్రాం ట్రేండింగ్ లో టాప్ ప్లేస్ కి రావడం మాత్రం నిజంగా సూపర్. మరి మహేష్, అల్లు అర్జున్, ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో అటు ఇటుగా టాప్ ప్లేస్ లో ఉన్నాయి.