ఇక్కడ హిట్ కొట్టినా.. ఛాన్స్ లేదు.. కానీ పొరుగు భాషలో ?
పెళ్లి చూపులు హిట్ సినిమాతో విజయ్ దేవరకొండ హీరో గా టాలీవుడ్ కి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. చేతినిండా సినిమాల్తో [more]
పెళ్లి చూపులు హిట్ సినిమాతో విజయ్ దేవరకొండ హీరో గా టాలీవుడ్ కి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. చేతినిండా సినిమాల్తో [more]
పెళ్లి చూపులు హిట్ సినిమాతో విజయ్ దేవరకొండ హీరో గా టాలీవుడ్ కి వచ్చాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. చేతినిండా సినిమాల్తో బిజీ అయ్యాడు. కానీ పెళ్లి చూపులు సినిమాలో నటించిన తెలుగు హీరోయిన్ రీతూ వర్మకి ఆ సినిమాతో పేరొచ్చింది కానీ.. అవకాశాలు రాలేదు. అసలు తెలుగులో అమ్మడుకి సినిమాలే లేవు. దానితో పక్క భాషలలో అదృష్టాన్ని వెతుక్కుంది. తమిళ, మలయాళ భషాల్లో ఒకటి అరా సినిమాల్తో నేనున్నా అంటున్న రీతూ వర్మ తాజాగా మలయాళ సినిమా కనులుకనులను దోచాయంటే సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టింది. మలయాళం లో తెరకెక్కించిన కనులుకనులను దోచాయంటే సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఈ సినిమాకి ఇక్కడా హిట్ టాక్ పడింది. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తో జోడి కట్టిన రీతూ వర్మకి ఈ సినిమాతో మంచి మార్కులు పడ్డాయి. రామాంటిక్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రీతూ చాలా అందంగా కనబడింది.
సాంప్రదాయ యువతిగా, మోడరన్ లేడీగా రెండు డిఫరెంట్ షేడ్స్ కలిగిన పాత్రలో ఆమె చక్కని వేరియేషన్స్ చూపించింది. మీరా పాత్రలో ఆమె అభినయం, ఆమె నటన అన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. రీతూ వర్మ పాత్రలో వున్న వేరియేషన్స్ చూస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. అలాగే దుల్కర్ సల్మాన్ తో రొమాంటిక్ గాను రీతూ ఆకట్టుకుంది. వారి మధ్యన రొమాంటిక్ సీన్స్ చాలా బావున్నాయి. మరి తెలుగులో ఆమెకి సరైన అవకాశం లేకపోయినా.. పొరుగు భాష హీరోలు ఆమె టాలెంట్ ని నమ్మి అవకాశం ఇస్తుంటే.. రీతూ దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే.