నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్.. బిగ్ బాస్ ఓటీటీ ప్రోమో వచ్చేసింది !

ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన 4 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో

Update: 2022-02-14 05:19 GMT

బిగ్ బాస్.. ఈ షో కి బుల్లితెరపై ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ ను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. గతేడాది డిసెంబర్ లో తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిన సంగతి తెలిసిందే. ఇటీవలే హిందీ బిగ్ బాస్ 15వ సీజన్ ఘనంగా ముగిసింది. ఇప్పటివరకూ తెలుగులో వచ్చిన 4 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. శృతి మించిన ప్రవర్తనలు, హద్దు దాటిన వెకిలి చేష్టలు సగటు ప్రేక్షకుడిని విసుగెత్తించాయి. దాంతో సీజన్ 5 టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది.

ఇక 6వ సీజన్ ను 24 గంటలు లైవ్ ఇచ్చేలా.. ఓటీటీలో టెలికాస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు గతంలోనే ప్రకటన కూడా చేశారు. తాజాగా బిగ్ బాస్ ఓటీటీ అఫీషియల్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. త్వరలోనే బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుందని, నాన్ స్టాప్ ఎంటర్టైన్ మెంట్ పొందేందుకు సిద్ధంగా ఉండాలని మేకర్స్ ప్రకటించారు. బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎప్పటినుంచి ఈ షో ప్రారంభం కాబోతుందంటూ సోషల్ మీడియాలో రోజూకో వార్త చక్కర్లు కొడుతుంది. ఈ సీజన్ లో పాత కంటెస్టెంట్లతో పాటు.. పలువురు కొత్త కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది.




Tags:    

Similar News