దిశా నిందితుల ఎంకౌంటర్ పై సినీ పరిశ్రమ స్పందన

కాఫీ తాగకుండానే కిక్ ఇచ్చిన న్యూస్ ఏంటంటే…. దిశా ని అత్యాచారం చేసి హత్య చేసిన వారిని తెలంగాణ పోలీస్ లు ఎంకౌంటర్ లో లేపెయ్యడం. ఉరి [more]

Update: 2019-12-06 05:48 GMT

కాఫీ తాగకుండానే కిక్ ఇచ్చిన న్యూస్ ఏంటంటే…. దిశా ని అత్యాచారం చేసి హత్య చేసిన వారిని తెలంగాణ పోలీస్ లు ఎంకౌంటర్ లో లేపెయ్యడం. ఉరి తియ్యాలని, ఎంకౌంటర్ చెయ్యాలని దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటిన సమయంలో తెలంగాణ పోలీస్ లు సైలెంట్ గా తమ పనిని ఎంకౌంటర్ రూపంలో ముగించెయ్యడం అనేది అందరిని ఆశ్చర్య పరిచే విషయం. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు దిశా నిందితులు ప్రయత్నించారు. దాంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. దిశాను చంపేసి తగులబెట్టిన చోటే నలుగురు నిందితులు చనిపోయారు. తెల్లవారుజామున 3.30 నుండి 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే నిందితుల ఎంకౌంటర్ పై తెలుగు సినీ పరిశ్రమ స్పందించింది. ఎన్టీఆర్, నాగార్జున, అనసూయ, నాని, మనోజ్, హరీష్ శంకర్ లు ట్విట్టర్ వేదికగా దిశా నిందితుల ఏంకౌటర్ విషయంలో న్యాయం జరిగిందని.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోలీస్ లకు సలాం చేశారు.

ఎన్టీఆర్: న్యాయం జరిగింది.. దిశా ఆత్మకు శాంతి కలగాలి.
అనసూయ: చాల హ్యాపీ గా ఉంది.
హరీష్ శంకర్: దండాలు సామీ.. మీరు పది కాలాలు పాటు చల్లగా ఉండాల అంటూ తెలంగాణ పోలీస్ లకు హరీష్ శంకర్ వందనం చేసాడు.
మంచు మనోజ్: ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది.. ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది. ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది. నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..?? ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..!
నాని: ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి… వాడు పోలీసోడు అయ్యుండాలి.
నాగార్జున: ఎంకౌంటర్ న్యూస్ తో నిద్ర లేచాను, దిశా కి న్యాయం జరిగింది.

Tags:    

Similar News