Raja Saab : ఒక తాత.. ఒక మనవడు.. ఒక నానమ్మ ఇది స్టోరీ
ది రాజా సాబ్ సినిమా కథను కొద్దిగా రివీల్ చేసిన దర్శకుడు మారుతి
డార్లింగ్ ప్రభాస్ ను ఒక్కసారి కలిస్తే చాలు అనుకునే వారు లక్షల్లో ఉంటారు. అదే ప్రభాస్ అభిమానించే వారిలో కొందరుంటారు. తనకు నటన నేర్పిన గురువుకు ముప్ఫయి ఐదు లక్షలు విలువ చేసే వాచ్ ఇచ్చి పుట్టిన రోజు నాడు గురుదక్షిణగా ఇచ్చారు. ఇక తన జిమ్ ట్రయినర్ కు కోటిన్నర విలువ చేసే కారును బహుకరించారని కూడా అంటున్నారు. అదే సమయంలో ప్రభాస్ తన సినీ జీవితంలో సహాపడిన, సహకరించిన ప్రతిఒక్కరినీ గుర్తుంచుకుని మరీ వారికి కానుకలు అందచేయడం అలవాటుగా మార్చుకున్నాడంటారు. ప్రభాస్ దృష్టిలో పడితే చాలు ఇక తమకు కూడా ఖరీదైన గిఫ్ట్ పడినట్లేనని ఆయనకు దగ్గరగా ఉండేవారు భావిస్తారు. అందుకే ప్రభాస్ ఇండ్రస్ట్రీలోనే కాదు.. బయట కూడా అందరి వాడుగా మారిపోయారు.
హారర్ ఫాంటసీ ఫిల్మ్ గా...
నిలువెత్తు విగ్రహం.. నిండైన రూపంతో ఉన్న ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారినా ఆయన తన పాత జ్ఞాపకాలను మరిచపోలేదంటున్నారు. తాజాగాప్రభాస్ నటిస్తున్నది రాజాసాబ్ చిత్రం డిసెంబరు 5వ తేదీన విడుదలవుతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దర్శకుడు మారుతిని కూడా తనను సార్ అని పిలవవద్దని, డార్లింగ్ అని పిలవాలని కోరడంతో ఇక ఆయన ఉబ్బితబ్బిబ్బయిపోయారట. తాజాగా ఈ సినిమా కథను కొద్దిగా దర్శకుడు మారుతి రివీల్ చేశాడు. ది బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ ఫిల్మ్ గా ఈ మూవీ ని రూపొందించినట్లు చెప్పారు. ఇందులో ఉన్న ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. ఒక తాత.. ఒక మనవడు.. ఒక నానమ్మ ఇది స్టోరీ అని క్లుప్తంగా చెప్పేశారు డైరెక్టర్ మారుతి.
వీఎఫ్ఎక్స్ వర్క్స్ తో...
హవేలీ రాజ్ మహల్ సెట్ తో పాటు వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఆకర్షణీయంగా ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఉంటాయని మారుతి గట్టిగా మాట ఇస్తున్నారు. భారీ సెట్లు, ప్రభాస్ మూవీ అంచనాకు తగినట్లుగా ఉన్నాయని, ఇక నిర్మాణం విషయంలో ఎక్కడా నిర్మాతలు తగ్గలేదని, ఖర్చు విషయంలో వెనకడాలేదని మారుతి చెప్పేశారు. రాజీ పడకుండా ఈ మూవీ చేయడానికి ప్రయత్నించామని, పూర్తి స్థాయిసక్సెస్ ఇవ్వడంతో పాటు ప్రభాస్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న నమ్మకం ఉందని మారుతి భరోసాగాచెబుతుండటంతో ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ మురిపించనుండటంతో ఇక ఫ్యాన్స్ కు కొత్త ఏడాదికి ముందే మంచి ఫీస్ట్ అని చెప్పాలి.